Fri Dec 05 2025 11:13:23 GMT+0000 (Coordinated Universal Time)
Operation Sindoor : ఉగ్ర దాడులకు స్కెచ్ వేసే ఇతగాడు హతమయ్యాడట
ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయిందనడానికి ఉదాహరణ కరడు గట్టిన నేరగాడు రవూవ్ అజహర్ హతమయ్యాడు

ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయిందనడానికి ఉదాహరణ కరడు గట్టిన నేరగాడు అబ్దుల్ రవూవ్ అజహర్ హతమయ్యాడు. మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ జైషే మహ్మద్ టెర్రరిస్ట్ అబ్దుల్ రవూఫ్ అజహర్ కూడా మరణించాడన్న వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ మీడియాలో కూడా ఈ మేరకు కథనాలు వస్తున్నాయి. అబ్దుల్ రవూఫ్ అజహర్ మామూలోడు కాదు. 1999లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం హైజాక్ కావడానికి వ్యూహం రచించింది అబ్దుల్ రవూఫ్ అజహర్. అప్పటి నుంచి అజహర్ భారత్ కు టార్గెట్ అయ్యాడు. మంగళవారం అర్ధరాత్రి భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ లో బహావల్ పూర్ లోని మర్కజ్ సుబాన్ కాంప్లెక్స్ పై డ్రోన్లతో దాడులు చేసింది. ఆ భవనం ధ్వంసమయింది.
దాడులు పూర్తయ్యేంత వరకూ టచ్ లో ఉండే...
ఈ దాడుల్లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబంలోని సభ్యులతో పాటు సన్నిహతులు పథ్నాలుగు మందితో పాటు రవూఫ్ అజహర్ కూడా ఉన్నారని చెబుతున్నారు. రవూవ్ అజహర్ భారత్ లో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో నిందితుడుగా ఉన్నాడు. అతను స్కెచ్ వేసి ఉగ్రవాదులను భారత్ పైకి ఉసిగొల్పుతాడు . తానిచ్చిన ఆపరేషన్ పూర్తయ్యేంత వరకూ రవూవ్ అజహర్ వారితో టచ్ లో ఉండి వారికి డైరెక్షన్ ఇస్తుంటాడని చెబుతున్నారు. రవూవ్ అజహర్ వాల్ స్ట్రీట్ జర్నల్ జర్నలిస్ట్ డేనియల్ షెర్ల్ హత్య లో కూడా ఇతను పాలుపంచుకున్నట్లు ఆధారాలున్నాయి. ఉగ్రవాదంపై మతపెద్దలను కలిసేందుకు కరాచీ వెళ్లిన డేనియల్ షెర్ల్ ను హతమార్చారు.
అనేక దాడులకు సూత్రధారి...
దీంతో పాటు 1999లో జరిగిన విమానం హైజాక్ లో కూడా రవూవ్ అజహర్ వెనక ఉండి నడిపించాడు. దాని ఫలితంగా చేతికి చిక్కిన మసూద్ అజహర్ ను భారత్ విడిచిపెట్టాల్సి వచ్చింది. అయితే ఇవి మాత్రమే కాకుండా 2001లో భారత్ పార్లమెంటుపై జరిగిన దాడిలోనూ, పఠాన్ కోట్ దాడి లోనూ, 2019 లో జరిగిన పుల్వామా లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ విషయంలో గాని రవూవ్ అజహర్ పాత్ర ఉందని తేల్చారు. ప్రస్తుతం జైషే మహ్మద్ కీలక కమాండర్ గా ఉన్న రవూవ్ అజహర్ మరణించాడన్న వార్తలు మసూద్ అజహర్ కుడి భుజం పోయినట్లేనని అంటున్నారు. అదే సమయంలో కరడు గట్టిన ఉగ్రవాది.. దాడులకు స్కెచ్ వేసే ఉగ్రవాద ఇంజనీర్ కూడా మరణించడంతో జైషే మహమ్మద్ కు కోలుకోలేని దెబ్బ అని అంతర్జాతీయ మీడియా పలు కథనాలను ప్రసారం చేస్తుంది.
Next Story

