North Korea : కిమ్ ఆయుధ పరీక్షలు... అప్రమత్తంగా ఉండాల్సిందేనా?
ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అమెరికా లక్ష్యంతో ఆయుధ పరీక్షలను నిర్వహిస్తున్నారు

ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అమెరికా లక్ష్యంతో ఆయుధ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రధాన భూభాగాన్ని తాకగల ఆయుధాలకు ఉపయోగించే నవీకరించిన ఘన ఇంధన ఇంజిన్ పరీక్షను స్వయంగా వీక్షించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా ఆదివారం వెల్లడించింది. ఈ పరీక్షతో తమ దేశ వ్యూహాత్మక సైనిక శక్తి మరింత బలపడిందని కిమ్ పేర్కొన్నట్లు తెలిపింది. అమెరికా, దాని మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకునే చురుకైన, గుర్తించడం కష్టమైన క్షిపణులు తయారు చేయాలన్న లక్ష్యానికి ఈ పరీక్ష అనుగుణమని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఉత్తరకొరియా చేస్తున్న ప్రకటనల్లో అతిశయోక్తి ఉండవచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు. ఘన ఇంధనంతో నడిచే క్షిపణులను కదిలించడం సులువు. ప్రయోగానికి ముందు ఇంధనం నింపాల్సిన అవసరం ఉండదు. అందువల్ల వాటి ప్రయోగాలను దాచిపెట్టడం సులభమవుతుంది. ద్రవ ఇంధన క్షిపణులకు ఈ సౌలభ్యం ఉండదు.

