Mon Jan 05 2026 04:32:39 GMT+0000 (Coordinated Universal Time)
Venezuelan : వెనెజువెలాపై అమెరికా దాడి.. అధ్యక్షుడి నిర్బంధం
దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాపై దాడులకు దిగింది

దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాపై దాడులకు దిగింది. అమెరికా మెరుపు దాడులతో వెనుజువెలా రాజధాని కారకాస్ విలవిలలాడింది. ఉన్నట్లుండి దాడులకు దిగడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. కారకాస్ నగరం మొత్తం అంధకారంలో చిక్కుకుంది. అమెరికా బలగాల అదుపులో వెనిజువెలా అధ్యక్షుడు అమెరికా చేతిలో చిక్కాడు. కారకాస్‌లో అమెరికా బలగాలు పట్టుకున్న వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను శనివారం సాయంత్రం అమెరికాలోని ఓ సైనిక స్థావరానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఆయనను న్యూయార్క్ నగరానికి తరలించారు.
మదురోను చుట్టుముట్టి...
అమెరికా ప్రభుత్వ విమానం నుంచి మదురో దిగుతుండగా ఎఫ్‌బీఐ అధికారులు చుట్టుముట్టారు. న్యూయార్క్ రాష్ట్రంలోని నేషనల్ గార్డ్ కేంద్రంలో రన్‌వేపై ఆయనను నెమ్మదిగా తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. అనంతరం హెలికాప్టర్లో మదురోను మాన్హాటన్కు తరలించారు. అక్కడ పెద్ద ఎత్తున బలగాలు మోహరించినట్లు చెబుతున్నారు. అమెరికా మీడియా కథనాల ప్రకారం, 63 ఏళ్ల మదురోను ముందుగా యూఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకెళ్లనున్నారు. ఆ తర్వాత బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించనున్నారు. ఇదే జైలులో గత ఏడాది రాపర్ షాన్ “డిడ్డీ” కాంబ్స్ తన విచారణ సమయంలో ఉన్నాడు.
నార్కో టెర్రరిజంపై...
మదురోతో పాటు ఆయన భార్యపై కూడా న్యూయార్క్‌లోని కోర్టులో ఒక తేదీన హాజరు పరచనున్నారు. వీరిద్దరిపై ‘నార్కో–టెర్రరిజం’, భారీగా కొకైన్‌ను అమెరికాలోకి అక్రమంగా తరలించడం, అక్రమ ఆయుధాలు కలిగి ఉండడం వంటి అభియోగాలు నమోదు చేశారు. మరుదో అనంతరం ఎవరు బాధ్యతలు చేపట్టాలన్న అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. వెనెజువెలా పై దాడులకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. కారకాస్ లో మొత్తం ఏడు చోట్ల పేలుళ్లు జరిగాయని చెబుతున్నారు. అయితే ఈ దాడుల్లో ఎవరైనా మరణించారన్న దానిపై ఇంకా ప్రకటన వెలువడ లేదు. ప్రజలు మాత్రం వీధుల్లోకి భయాందోళనలతో పరుగులు తీశారు.
Next Story

