Fri Jan 23 2026 14:51:02 GMT+0000 (Coordinated Universal Time)
Nepal : నేపాల్ లో ప్రశాంతత.. సైన్యం రంగంలోకి దిగడంతో.. సద్దుమణిగిన ఆందోళనలు
నేపాల్ రాజధాని ఖాఠ్మండు బుధవారం కట్టుదిట్టమైన భద్రత లో ఉంది

నేపాల్ రాజధాని ఖాఠ్మండు బుధవారం కట్టుదిట్టమైన భద్రత లో ఉంది.పార్లమెంట్ భవనాన్ని ఆందోళనకారులు దహనం చేయడంతో పాటు, ప్రధాని రాజీనామా చేయాల్సి రావడంతో, రెండు దశాబ్దాల్లోనే అతిపెద్ద రాజకీయ హింసను ఎదుర్కొంటున్న దేశంలో సైనికులు వీధుల్లో మార్చ్ ఫాస్ట్ చేస్తున్నారు. సోమవారం సోషల్ మీడియా నిషేధం, అవినీతి ఆరోపణలపై ఖాఠ్మండు లో ప్రారంభయిన ఆందోళనలు మంగళవారం కూడా కొనసాగాయి. అయితే, మంగళవారం జరిగిన కఠిన అణచివేతలో కనీసం 19 మంది ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశంగా మారాయి. ప్రభుత్వ భవనాలు, నేతల ఇళ్లు, సూపర్ మార్కెట్లు, ఇతర కట్టడాలు మంటల్లో కాలిపోయాయి. రోడ్లపై కాలిపోయిన వాహనాలు, టైర్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
సైన్యం హెచ్చరికలతో...
దీంతో శ్రీలంక సైన్యం రంగంలోకి దిగింది.దేశాన్ని అశాంతి, అస్థిరత వైపు నడిపే చర్యలపను ఉపేక్షించేంది లేదని సైన్యం హెచ్చరిక జారీ చేసింది. దీంతో ఖాఠ్మండులో గత రెండు రోజలుగా జరిగిన ఆందోళనలు నేడు కొంత సద్దుమణిగాయి. ఖాఠ్మండులో ఈ రోజు నిశ్శబ్దంగా ఆవరించింది. ప్రతి చోట సైన్యం రోడ్లపై పహారా కాస్తోంది. చెక్పాయింట్లను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మంగళవారం ఆందోళనకారులు మాజీ ప్రధాని, కమ్యూనిస్టు పార్టీ నేత కేపీ శర్మ ఓలీ ఇంటిని దహనం చేశారు. అనంతరం ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
ప్రధాని ఆచూకీ లేదు...
ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో స్పష్టంగా తెలియదు. నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్డేల్ మంగళవారం రాత్రి వీడియో మెసజ్ ను దేశ ప్రజలకు విడుదల చేశారు. "దేశానికి శాంతియుత పరిష్కారం అందించాలంటే, అన్ని వర్గాలు ఆందోళనలను విరమించి చర్చలకు రావాలి" అని పిలుపునిచ్చారు. ఆందోళనకారులను చర్చలకు సైన్యం ఆహ్వానించింది. వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించింది. మరొక వైపు నేపాల్ లో ఎదుర్కొంటున్న రాజకీయ సంక్షోభంతో భారత్ అప్రమత్తమయింది. ప్రధాని నరేంద్ర మోడీనేపాల్ స్థిరత్వం, శాంతి, సమృద్ధి తమకు అత్యంత ముఖ్యమైనవన్నారు. చర్చలకు ఆందోళనకారులు వస్తే పరిస్థితి సద్దుమణిగే అవకాశముంది.
Next Story

