Tue Jul 08 2025 17:31:55 GMT+0000 (Coordinated Universal Time)
నింగిలోకి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు తేదీ ఖరారైంది. యాక్సియం-4 (ఏఎక్స్-4) మిషన్లో భాగంగా జూన్ 25న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) బయలుదేరనున్నారు. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) అధికారికంగా తెలియజేసింది. యాక్సియం-4 మిషన్ ప్రయోగం భారత కాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 12:01 గంటలకు జరగనుంది. ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ ఈ ప్రయోగానికి వేదిక కానుంది.
ప్రయోగం విజయవంతంగా జరిగిన తర్వాత, వ్యోమనౌక గురువారం సాయంత్రం 4:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం (డాకింగ్) అవుతుందని నాసా వివరించింది. భూమి నుంచి బయలుదేరిన సుమారు 28 గంటల ప్రయాణం అనంతరం ఈ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకుంటుంది. శుభాంశు శుక్లా నేతృత్వంలోని బృందం అక్కడ 14 రోజుల పాటు బస చేస్తుంది. ఈ సమయంలో వారు భారరహిత స్థితిలో పలు కీలకమైన శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు. ఈ ప్రయోగం తొలుత మే 29నే జరగాల్సి ఉండగా, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.
Next Story