Fri Dec 05 2025 16:21:07 GMT+0000 (Coordinated Universal Time)
రెండ్రోజుల క్రితం మిస్సైన నటి దారుణ హత్య
రెండ్రోజుల క్రితం మిస్సైన నటి కథ విషాదాంతమైంది. రెండ్రోజులుగా నటి రైమా ఇస్లాం కనిపించడం లేదంటూ

బంగ్లాదేశ్ లో రెండ్రోజుల క్రితం మిస్సైన నటి కథ విషాదాంతమైంది. రెండ్రోజులుగా నటి రైమా ఇస్లాం కనిపించడం లేదంటూ ఆదేశ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆఖరికి ఆమె దారుణ హత్యకు గురైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని కడమ్ తోలి ప్రాంతంలో అలీపూర్ బ్రిడ్జి వద్ద ఒక గన్నీ బ్యాగ్ లో రైమా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఎస్ఎస్ఎమ్సి ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా.. రైమా మిస్ అయినప్పటి నుంచి ఆమె భర్తపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. భర్త షాఖావత్, డ్రైవర్ ను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. రైమా శరీరంపై ఉన్న కత్తిపోట్లు, గాయాలను బట్టి కిరాయి హంతకులు ఈ హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. రైమా పోస్టుమార్టం నివేదిక అందితే.. మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. రైమా ఇస్లాం 1998లో బర్తమాన్ అనే చిత్రం ద్వారా సినీ ప్రవేశం చేసింది. జాతీయ స్థాయిలో 25 పైగా చిత్రాల్లో నటించి మంచి పేరుతెచ్చుకున్న ఆమె.. పలు బంగ్లా సీరియళ్లలోనూ నటించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో అసోసియేట్ మెంబర్గా ఉన్నారు.
News Summary - Missing Bangladeshi actress Raima Islam Shimu’s body found in a sack; husband confesses to murder
Next Story

