Iran - Israel War : మిచిగాన్ పై దాడి చేసిన వ్యక్తి కుటుంబానికి ఇజ్రాయెల్ దాడితో సంబంధం?
అమెరికా మిచిగన్‌లోని ఒక పెద్ద సినగాగ్‌పై దాడి చేసిన వ్యక్తి కుటుంబానికి, ఈ నెల ప్రారంభంలో లెబనాన్‌లో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడితో సంబంధం ఉన్నట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది

అమెరికా మిచిగన్‌లోని ఒక పెద్ద సినగాగ్‌పై దాడి చేసిన వ్యక్తి కుటుంబానికి, ఈ నెల ప్రారంభంలో లెబనాన్‌లో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడితో సంబంధం ఉన్నట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం ప్రకారం, మార్చి 5న లెబనాన్‌లో జరిగిన దాడిలో ఇబ్రహీం ఘజాలి అనే వ్యక్తి మరణించాడు. అతను హిజ్బుల్లా కమాండర్‌గా పనిచేసి, ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగించే యూనిట్‌కు ఆయుధాలు నిర్వహించేవాడని ఆరోపించింది. ఆ దాడిలో అతని బంధువులు మరో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. అదే కుటుంబానికి చెందిన ఐమన్ మొహమ్మద్ ఘజాలి , ఆ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత అమెరికాలో మిచిగన్‌లోని డెట్రాయిట్ నగర పరిసరాల్లో ఉన్న పెద్ద సినగాగ్‌పై కారుతో దూసుకెళ్లి దాడి చేసినట్టు అధికారులు చెబుతున్నారు. భద్రతా సిబ్బంది కాల్పులు జరిపిన తర్వాత అతను తనను తాను కాల్చుకొని మృతి చెందినట్టు పేర్కొన్నారు.

