Sat Jan 03 2026 03:59:17 GMT+0000 (Coordinated Universal Time)
Earth Quake : మెక్సికోలో భూకంపం
దక్షిణ, మధ్య మెక్సికోను శుక్రవారం శక్తివంతమైన భూకంపం కుదిపేసింది.

దక్షిణ, మధ్య మెక్సికోను శుక్రవారం శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. మెక్సికో జాతీయ భూకంపశాస్త్ర సంస్థ తెలిపిన వివరాల ప్రకారం భూకంప తీవ్రత ప్రాథమికంగా 6.5గా నమోదైంది. దక్షిణ గెర్రెరో రాష్ట్రంలోని సాన్ మార్కోస్ పట్టణం సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. ఇది పసిఫిక్ తీరంలోని పర్యాటక కేంద్రం అకాపుల్కోకు సమీపంలో ఉంది.
తీవ్రత ఎంతంటే?
అమెరికా భూగర్భ సర్వే సంస్థ తెలిపిన ప్రకారం భూకంపం భూమికి సుమారు 35 కిలోమీటర్ల లోతులో చోటుచేసుకుంది. గెర్రెరో రాష్ట్రంలోని రాంచో వియెహోకు ఉత్తర–వాయువ్య దిశగా సుమారు 2.5 మైళ్ల దూరంలో కంపనం నమోదైంది. ఈ ప్రాంతం అకాపుల్కోకు ఈశాన్యంగా పర్వత ప్రాంతంలో ఉంది.ఇప్పటివరకు ఎలాంటి పెద్ద నష్టం సమాచారం లేదని గవర్నర్ తనకు తెలిపినట్లు వెల్లడించారు. భూకంపం ధాటికి వెంటనే మెక్సికో సిటీ, అకాపుల్కోలో నివాసితులు, పర్యాటకులు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు.
Next Story

