Sun Dec 08 2024 16:13:24 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి తండ్రైన మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్
తాజాగా మరో కూతురికి తన భార్య జన్మనిచ్చినట్లు జుకర్ బర్గ్ వెల్లడిస్తూ.. కూతురి ఫొటోలను నెటిజన్లతో పంచుకున్నారు.
మెటా సీఐఓ మార్క్ జుకర్ బర్గ్ మూడోసారి తండ్రయ్యారు. ఆయన భార్య ప్రిసిల్లా ఛాన్ మూడో కాన్పులో కూతురికి జన్మనిచ్చింది. ఇప్పటికే ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తాజాగా మరో కూతురికి తన భార్య జన్మనిచ్చినట్లు జుకర్ బర్గ్ వెల్లడిస్తూ.. కూతురి ఫొటోలను నెటిజన్లతో పంచుకున్నారు. ఈ పాపకు ఆరెలియా ఛాన్ జుకర్ బర్గ్ అని పేరుపెట్టినట్లు ఆయన తెలిపారు. మార్క్ - ప్రిసిల్లా దంపతులకు 2015 డిసెంబర్ లో మొదటి కూతురు మాక్సిమా జన్మించింది. 2017 ఆగస్టులో మరో కూతురికి ప్రిసిల్లా జన్మనిచ్చింది. ఆమె పేరు ఆగస్ట్. కాగా.. జుకర్ బర్గ్ దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.
Next Story