Wed Jan 28 2026 21:56:36 GMT+0000 (Coordinated Universal Time)
Kamala Harrsis : ఓటమిపై కమలా హారిస్ ఏమన్నారంటే?
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రటిక్ పార్టీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయిన అభ్యర్థి కమలా హారిస్ తొలి సారి స్పందించారు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. డెమొక్రటిక్ పార్టీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయిన అభ్యర్థి కమలా హారిస్ తొలి సారి స్పందించారు. తాను అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తున్నానని కమలా హారిస్ తెలిసారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరంపై ఆమె మాట్లాడుతూ అయితే తాను ఓటమిని అంగీకరిస్తూనే ఇది తాము ఆశించిన ఫలితం కాదని తెలిపారు.
స్వేచ్ఛ కోసం...
దీని కోసం తాము పోరాడలేదన్న కమల, కానీ ప్రజాభిప్రాయాన్ని అంగీకరించాల్సిందేనని తెలిపారు. అయితే తాను పోరుబాటను ఎప్పటికీ వీడేది లేదని కమలా హారిస్ తెలిపారు. సానుకూల ఫలితాలకు కొంత సమయం పడుతుందని కమలా హారిస్ అభిప్రాయపడ్డారు. అందుకోసం వేచి చూద్దామని తెలిపారు. తన మద్దతు దారులందరూ అమెరికాలో స్వేచ్ఛ కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాలని ఆమె పిలుపు నిచ్చారు. ఓటమిని సులువుగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు.
Next Story

