Tue Dec 09 2025 03:30:01 GMT+0000 (Coordinated Universal Time)
Earth Quake : జపాన్ లో భారీ భూకంపం.. గతంలో ఎన్నడూ చూడని విధంగా
జపాన్‌లో భారీ భూకంపం సంభంవించింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి

జపాన్‌లో భారీ భూకంపం సంభంవించింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. భూకంప తీవ్రతకు 23 మందికి గాయాలయ్యాయి. ఉత్తర జపాన్ తీరానికి సమీపంలో సోమవారం రాత్రి 9.13 గంటల ప్రాంతంలో వచ్చిన భూకంపంతో ప్రజలు భయకంపితులయ్యారు. రిక్టర్ స్కేల్ పై 7.5 తీవ్రతగా నమోదయింది. ఈ భూకంప తీవ్రతకు 23 మంది గాయపడ్డారు. పసిఫిక్ తీర ప్రాంతాల్లో సునామీ అలలు తాకాయి. ఆ ప్రాంతంలో మరో భూకంపం వచ్చే ప్రమాదం పెరిగిందని అధికారులు హెచ్చరించారు. జపాన్ వాతావరణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఇషికావా ప్రిఫెక్చర్‌లోని కుజి పోర్ట్ వద్ద 70 సెంటీమీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి.
సునామీ హెచ్చరికలు...
ఆఓమోరి–ఇవాటే తీర ప్రాంతాల్లో 50 సెంటీమీటర్ల వరకు సముద్ర తీరాన్ని అలలు తాకాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం ఏది నమోదు కాలేదు. ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రకారం 23 మంది గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరం. పడిపోయిన వస్తువులతో చాలామంది గాయపడ్డారని ఎన్‌హెచ్‌కే తెలిపింది. హచినోహేలోని ఒక హోటల్లో పలువురికి గాయాలయ్యాయి. తోహొకులో ఒకరిని కారు గోతిలో పడిపోవడంతో స్వల్ప గాయాలు అయ్యాయి. భూకంపం సోమవారం రాత్రి 11.15 గంటలకు పసిఫిక్ సముద్రంలో తీరానికి 80 కిలోమీటర్ల దూరంలో, భూగర్భం 50 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. హచినోహేలో వణికిన సీసీటీవీ దృశ్యాలు టీవీ చానళ్ళు ప్రసారం చేశాయి.
ప్రాణ నష్టం మాత్రం...
ఇంత భారీ పగుళ్లు తాను ఎప్పుడూ చూడలేదని స్థానికులు తెలిపారు. భూకంప తీవ్రతకు దాదాపు 800 ఇళ్లకు విద్యుత్ నిలిచి పోయింది. షింకాన్సేన్ బుల్లెట్ రైళ్లు, కొన్ని లోకల్ రైళ్లు నిలిపివేశాయి. 18 రక్షణ హెలికాప్టర్లు నష్టం అంచనా కోసం పంపారు. హొకైడోలోని న్యూ చిటోజే విమానాశ్రయంలో 200 మంది రాత్రంతా నిలిచిపోయారు. హచినోహే ఎయిర్‌బేస్‌లో 480 మంది ఆశ్రయం తీసుకున్నారు. భారీ భూకంప ప్రమాదం పెరిగిందని హెచ్చరించారు. తూర్పు తీరంలో టోక్యోకు తూర్పున చిబా నుంచి హొకైడో వరకు రిక్టర్ స్కేల్ పై 8 తీవ్రత వరకు భూకంపం వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. ప్రజలు ఆందోళనలో బయటకు పరుగులు తీశారు. మంగళవారం ఉదయం 6.20 గంటలకు ఉత్తర పసిఫిక్ తీర ప్రాంతాల్లోని అన్ని సునామీ హెచ్చరికలను ఎత్తివేశారు.అమెరికా యూఎస్‌జిఎస్ ప్రకారం మంగళవారం తెల్లవారుజామున హోంచోకు దక్షిణంగా 5.1 తీవ్రతతో మరో కంపనం నమోదైంది.
Next Story

