Wed Feb 04 2026 11:27:09 GMT+0000 (Coordinated Universal Time)
మైసూర్ పాక్ కు పాకిస్థాన్ కు సంబంధం సంబంధం ఏమిటి ...!
మైసూర్ పాక్ పేరులో 'పాక్' పదం మార్చిన స్వీట్ షాపులు. జైపూర్లో మోతీపాక్ కాస్తా మోతీశ్రీగా మారింది.

మైసూర్ పాక్ కు పాకిస్థాన్ కు ఎలాంటి సంబంధం లేదన్న విషయం తెలిసిందే. కానీ అందులో ఉన్న 'పాక్' పదం కొందరికి నచ్చడం లేదట. అందుకే మైసూర్ పాక్ లాంటి స్వీట్స్ పేరులో ఉన్న పాక్ ను లేపేశారు.
జైపూర్లో ప్రతి మిఠాయి పేరులోనూ పాక్కు బదులు శ్రీ అని చేర్చేశారు. అలా మోతీపాక్ కాస్తా మోతీశ్రీ, ఆమ్పాక్ కాస్తా ఆమ్శ్రీ అయిపోయింది. జైపూర్లోని ప్రఖ్యాత ‘త్యోహార్ స్వీట్స్’, ‘బాంబే మృష్టాన్ భండార’ వంటి స్వీట్షాపుల యజమానులు ఈ నిర్ణయం తీసుకోగా.. కస్టమర్లు కూడా మెచ్చుకుంటున్నారట. పాక్ అనే పదాన్ని వినాలని ఎవరికీ లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్వీట్ షాపుల యజమానులు చెబుతున్నారు.
Next Story
