Wed Mar 18 2026 09:10:32 GMT+0530 (India Standard Time)
Iran - Israel War : ఇరాన్‌కు భారీ దెబ్బ: కీలక భద్రతాధికారుల మృతి
ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం రెండో వారంలోకి చేరుకుంది.

ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం రెండో వారంలోకి చేరుకుంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు చెందిన ఇద్దరు కీలక భద్రతాధికారులు మృతి చెందడంతో ఆ దేశ నాయకత్వానికి పెద్ద దెబ్బ తగిలింది. ఇదే సమయంలో ఇరాన్ బుధవారం గల్ఫ్ అరబ్ దేశాలు, ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులను మళ్లీ ప్రారంభించింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజానీ, రివల్యూషనరీ గార్డ్‌కు చెందిన బసిజ్ దళాల అధిపతి జనరల్ ఘోలామ్ రెజా సోలేమాని ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం మొదటి రోజే సుప్రీం లీడర్ ఖమేనీ ఎయిర్ స్ట్రైక్‌లో మరణించిన తర్వాత లారిజానీ దేశంలో అత్యంత ప్రభావశీల నేతగా భావించేవారు. జనవరిలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అణచివేయడంలో ఈ ఇద్దరూ కీలక పాత్ర పోషించారని ఇరాన్ అధికార వర్గాలు తెలిపాయి.
క్షిపణులతో విరుచుకుపడిన ఇజ్రాయిల్...
బుధవారం ఇరాన్ ఇజ్రాయెల్‌పై భారీగా క్షిపణులు ప్రయోగించింది. దేశ మధ్యభాగంలో సైరన్లు మోగాయి. టెల్ అవీవ్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రమత్ గాన్ ప్రాంతంలో ఇద్దరు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ వైద్య సంస్థ తెలిపింది. సౌదీ అరేబియా, కువైట్ సహా పలు గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు చేసింది. అయితే వాటిలో చాలా వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి.
హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు...
ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగుతుందని ఇరాన్ స్పష్టం చేసింది. అక్కడుగా ప్రపంచ చమురులో ఐదో వంతు రవాణా జరుగుతుంది. దీనిపై ఆందోళనలు పెరుగుతున్నాయి. కొన్ని నౌకలు ప్రయాణం కొనసాగిస్తున్నప్పటికీ, అమెరికా, ఇజ్రాయెల్, వారి మిత్ర దేశాలకు అనుమతి లేదని ఇరాన్ తెలిపింది. సుమారు 20 నౌకలు దాడులకు గురయ్యాయి.
అమెరికా, మిత్రదేశాల వైఖరి
హోర్ముజ్ మార్గ భద్రత కోసం యుద్ధనౌకలు పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. అయితే నాటో, ఇతర మిత్రదేశాలు దీనికి మద్దతు ఇవ్వలేదని చెప్పారు.ఇరాన్ తీర ప్రాంత క్షిపణి కేంద్రాలపై అమెరికా బలగాలు భారీ బాంబులతో దాడి చేశాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ ఘర్షణలో జోక్యం చేసుకోవాలని యూరోపియన్ యూనియన్ ఆసక్తి చూపడం లేదు. “ఇది యూరప్ యుద్ధం కాదు” అని ఆ సంస్థ విదేశాంగ ప్రతినిధి తెలిపారు.బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై దాడి జరిగినా ఎలాంటి నష్టం లేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వెల్లడించింది. అణు ప్రమాదాలు జరగకుండా నియంత్రణ అవసరమని సూచించింది.
లెబనాన్‌లో కొనసాగుతున్న దాడులు
ఇజ్రాయెల్ లెబనాన్‌లో హిజ్బుల్లా లక్ష్యాలపై దాడులు కొనసాగించింది. నబతియెహ్ ప్రాంతంలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘర్షణల కారణంగా లెబనాన్‌లో 10 లక్షలకు పైగా ప్రజలు ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఇజ్రాయెల్‌లో 14 మంది, ఇరాన్లో 1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
Next Story

