Israel - Iran - America War : కాల్పుల విరమణకు అంగీకారం..చర్చలకు సిద్ధం
రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించింది.

ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి యుద్ధంలో రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటించింది. శుక్రవారం నుంచి ఇస్లామాబాద్‌లో అమెరికాతో చర్చలు చేపడతామని తెలిపింది. “ఇది యుద్ధం ముగిసిందని కాదు. శత్రువు స్వల్ప తప్పిదం చేసినా పూర్తి శక్తితో ప్రతిస్పందిస్తాం” అని ప్రకటనలో స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడులను విస్తరించమన్న తన హెచ్చరికలను వెనక్కి తీసుకున్నారు. ఇరాన్ రెండు వారాల కాల్పుల విరమణకు సిద్ధంగా ఉండి హోర్ముజ్ జలసంధిని తెరిస్తే, వంతెనలు, విద్యుత్ కేంద్రాలు వంటి పౌర లక్ష్యాలపై దాడులు నిలిపేస్తామని చెప్పారు. మంగళవారం ట్రంప్ చేసిన “ఒక నాగరికత ఈ రాత్రే నశిస్తుంది” అనే వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. డెమోక్రాట్లు, ట్రంప్‌కు దూరమైన ‘మేక్ అమెరికా గ్రేట్ అగేన్’ వర్గం, అమెరికాకు చెందిన తొలి పోప్ సహా పలువురు ఖండించారు.

