Israel - Iran War : క్షిపణి దాడులను కొనసాగిస్తున్న ఇరాన్...సౌదీ సైనిక స్థావరంపై అటాక్
ఇరాన్ శుక్రవారం కూడా ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలపై క్షిపణి దాడులు కొనసాగించింది

ఇరాన్ శుక్రవారం కూడా ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలపై క్షిపణి దాడులు కొనసాగించింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణి, డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో కనీసం పది మంది అమెరికా సైనికులు గాయపడ్డారని అమెరికా అధికారులు తెలిపారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. స్థావరంలో ఉన్న అమెరికా ఇంధన నింపే విమానాలకు కూడా నష్టం వాటిల్లిందని వెల్లడించారు.ఇదే సమయంలో ఇజ్రాయెల్ ఇరాన్‌పై తన దాడులను మరింత విస్తరిస్తామని హెచ్చరించింది. అమెరికా సైన్యం కూడా ఇరాన్‌పై దాడులు కొనసాగించింది. అయితే హోర్ముజ్ జలసంధిని మూసివేసిన అంశంపై ఇరాన్ ఇంధన కేంద్రాలను ధ్వంసం చేస్తామని చేసిన హెచ్చరికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాయిదా వేశారు.స్టాక్ మార్కెట్ ఒత్తిడి మధ్య ట్రంప్ ఏప్రిల్ 6వ తేదీ వరకు గడువు పొడిగించారు. చర్చలు బాగా జరుగుతున్నాయని, ఇరాన్ స్వయంగా ఈ గడువు కోరిందన్నారు. అయితే ఇరాన్ మాత్రం తాము అమెరికా వైట్ హౌస్‌తో చర్చలు జరపడం లేదని బహిరంగంగా చెబుతోంది.

