Sat Dec 13 2025 22:30:58 GMT+0000 (Coordinated Universal Time)
Iran-Israel war : యుద్ధంతో దద్దరిల్లుతున్న నగరాలు.. కొత్త వెపన్లతో వార్ కు దిగిన ఇరాన్
ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం కొనసాగుతుంది. గత ఎనిమిది రోజులుగా జరుగుతున్న యుద్ధంలో అనేక ప్రాణాలు పోయాయి

ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం కొనసాగుతుంది. గత ఎనిమిది రోజులుగా జరుగుతున్న యుద్ధంలో అనేక ప్రాణాలు పోయాయి. భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఇరు దేశాల్లో సామాన్య పౌరుల నుంచి సైనికాధికారుల వరకూ ప్రాణాలు కోల్పోయిన వారిలో ఉన్నారు. ఇక ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరం అయితే బాంబులతో దద్దరిల్లిపోతుంది. యుద్ధం మిగిల్చిన విషాదం టెహ్రాన్ లోనే కనిపిస్తుంది. ఎన్నాళ్లు యుద్ధం సాగుతుందో తెలియక ప్రజలు టెహ్రాన్ నగరాన్నివదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. ఇక ఇజ్రాయిల్ లో కూడా అదే రకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఇజ్రాయిల్ - ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా రణరంగంగా మారిదంనే చెప్పాలి.
దాడులు - ప్రతిదాడులతో...
ఇక దాడులు - ప్రతిదాడులతో ఇరాన్ ఇజ్రాయిల్ తెగబడటుతుండటంతో ఎప్పుడు ఎక్కడి నుంచినెత్తిమీద బాంబులు పడతాయేమోనన్న భయం అందరిలోనూ నెలకొంది. ఇక తొలిసారిగా ఇరాన్ క్లస్టర్ బాంబులను ఉపయోగించాయి. ఇరాన్ క్లస్టర్ బాంబులను ఉపయోగించిందని టెల్ అవీవ్ దళాలు చెబుతున్నాయి. యుద్ధం మొదలయిన వారం రోజుల తర్వాత ఇరాన్ క్లస్టర్ బాంబులు ఉపయోగించడంతో యుద్ధం మరింత తీవ్రమవుతుందన్న ఆందోళన అఅతర్జాతీయ సమాజంలో వ్యక్తమవుతుంది.
అంతర్జాతీయ సమాజంలో ఆందోళన...
క్లస్టర్ బాంబులు చాలా ప్రమాదకరమైనవని చెబుతున్నారు. బాలిస్టిక్ క్షిపణుల కంటే ఇవి డేంజర్ అని టెల్ వీవ్ అధికారి ఒకరు తెలిపారు. తాము ఇరాన్ లోని అణు స్థావరాలు, సైనిక శిబిరాలపై దాడులు చేస్తుంటే ఇరాన్ మాత్రం పౌర నివాసాలపై దాడులకు దిగుతూ యుద్ధ తంత్రాన్ని విస్మరిస్తుందని ఇజ్రాయిల్ ఆరోపిస్తుంది. రెండు దేశాలు పట్టుదలగా ఉండటంతో పాటు ఇరు దేశాల మధ్య సయోధ్యం సాధ్యం కాకపోవడంతో యుద్ధం మరికొంత కాలం కొనసాగే అవకాశముందని, దీని వల్ల రెండు దేశాలు భారీగా నష్టపోవడం ఖాయమని, ఆ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ పై పడుతుందని, ప్రధానంగా క్రూడాయిల్ మార్కెట్ పై పడి పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతుంది.
Next Story

