Israel - Iran War : కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు.. కొనసాగుతున్నదాడులు
ఇజ్రాయెల్ లెబనాన్లో దాడులు ప్రారంభించడంతో ప్రతిస్పందనగా ఇరాన్ మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది

ఇజ్రాయెల్ లెబనాన్లో దాడులు ప్రారంభించడంతో ప్రతిస్పందనగా ఇరాన్ మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో యుద్ధాన్ని నిలిపే కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం అమలు కాలేదు. జలసంధిని వెంటనే తెరవాలని వైట్ హౌస్ డిమాండ్ చేసింది. శాంతి చర్చలు కొనసాగాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది.ఒప్పందం కుదిరిన తర్వాత అమెరికా, ఇరాన్ రెండూ తామే గెలిచామని ప్రకటించాయి. ప్రపంచ నాయకులు ఉపశమనం వ్యక్తం చేశారు. అయితే అదే సమయంలో ఇరాన్, గల్ఫ్ అరబ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులు మళ్లీ దాడి చేశాయి. మరోవైపు లెబనాన్లో హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు పెంచింది. బీరుట్లో వాణిజ్య, నివాస ప్రాంతాలపై బాంబులు వర్షం కురిపించింది. ఒక్క రోజులోనే అక్కడ 182 మంది ప్రాణాలు కోల్పోయారు.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ ఒప్పందాన్ని “సున్నితమైనది”గా అభివర్ణించారు. తాజా హింస ఆ ఒప్పందాన్ని పూర్తిగా దెబ్బతీయవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

