Mon Mar 23 2026 11:14:40 GMT+0530 (India Standard Time)
Iran - Israel War : హర్మూజ్ దాటితే భారీ సుంకం
హర్మూజ్‌ను దాటే నౌకలపై ఇరాన్ భారీగా సుంకం విధించింది

హర్మూజ్‌ను దాటే నౌకలపై ఇరాన్ భారీగా సుంకం విధించింది. రెండు మిలియన్ డాలర్ల సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. భారతీయ కరెన్సీలో 18.80 కోట్ల రూపాయలను హార్మోజ్ జలసంధిని దాటితే చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచ నౌకా రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిపై తన నియంత్రణను మరింత పటిష్ఠం చేసుకునే దిశగా ఇరాన్ చర్యలు చేపడుతోంది.
హర్మూజ్ జలసంధిపై తన నియంత్రణను...
ఈ జల సంధి నుంచి వెళ్లే కొన్ని ట్యాంకర్ల నుంచి 2 మిలియన్ డాలర్ల ఛార్జీలు వసూలు చేయాలని ఇరాన్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ భారీ రుసుము ఆ జల మార్గాన్ని నియంత్రించేందుకు ఒక కొత్తవిధానమని ఇరాన్ ప్రజాప్రతినిధి అలాద్దీన్ బౌరోజెర్దీ అన్నట్లు అక్కడి మీడియా తెలిపింది. ఇది ఇరాన్‌కున్న బలాన్ని సూచిస్తుందని ఆయన ఓ టీవీ కార్యక్రమంలో అన్నట్లు పేర్కొంది.
Next Story

