Israel - Iran War : ఇరాన్ యుద్ధంలో హౌతీల ప్రవేశం.. ఇజ్రాయెల్‌పై క్షిపణులు
ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమై నెల రోజులు దాటింది

ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమై నెల రోజులు దాటింది. అయినా దాడులు ఆగలేదు. ఇరాన్ మద్దతుతో ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు శనివారం మధ్యప్రాచ్య యుద్ధంలోకి ప్రవేశించారు. ఇజ్రాయెల్‌పై రెండు క్షిపణులు ప్రయోగించినట్లు ప్రకటించారు. ఇదే సమయంలో సుమారు 2,500 మంది అమెరికా మెరైన్లు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. యుద్ధాన్ని ఆపే మార్గాలపై చర్చించేందుకు ప్రాంతీయ దేశాలు ఆదివారం సమావేశం కానున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు సరఫరాలను ప్రభావితం చేసింది. ఎరువుల కొరత, విమాన రవాణా అంతరాయం చోటుచేసుకుంది. వ్యూహాత్మక ప్రాధాన్యం గల హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం మార్కెట్లను, ధరలను కుదిపేసింది. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తున్నాయి. ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ అరబ్ దేశాలపై దాడులు చేస్తోంది. ఇప్పటివరకు 3,000 మందికి పైగా మరణించారు.

