Iran - Amrica - Talks : ఇరాన్ - అమెరికా చర్చలు ఫలప్రదం అవుతాయా?
ఇరాన్ - అమెరికాల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి

ఇరాన్ - అమెరికాల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. కానీ ఈ చర్చల్లో అనేక అంశాలు కీలకంగా మారకనున్నాయి. ఇరాన్లో కాల్పుల విరమణ ఇంకా అస్థిరంగానే ఉన్న వేళ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శుక్రవారం పాకిస్తాన్‌కు బయల్దేరారు. ఇరాన్ ప్రతినిధులతో ఉన్నత స్థాయి చర్చలు జరపాలని ఆయన ప్రయాణం. ఇదే సమయంలో ఇజ్రాయెల్–హెజ్బొల్లా మధ్య కాల్పులు కొనసాగుతుండగా, హార్ముజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టు కొనసాగిస్తోంది. యుద్ధాన్ని శాశ్వతంగా ఆపే విస్తృత ఒప్పందం దిశగా చర్చలు సాగుతున్నప్పటికీ, విరమణను దెబ్బతీసే అంశాలు అనేకం ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ విప్లవ గార్డుకు సమీపంగా భావించే ‘తస్నీమ్’ వార్తా సంస్థ, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆగితేనే శనివారం జరగాల్సిన చర్చలు జరుగుతాయని పేర్కొంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సామాజిక మాధ్యమంలో, హార్ముజ్ జలసంధి ద్వారా నౌకా రాకపోకలు నిలిపివేయడమే ఇరాన్‌కు ఉన్న ఏకైక ఒత్తిడి సాధనమని వ్యాఖ్యానించారు.

