Tue Jul 08 2025 17:37:30 GMT+0000 (Coordinated Universal Time)
నేడు శుభాంశు శుక్లా రోదసీ ప్రయాణం
భారత్ వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసీ ప్రయాణం నేడు జరగనుంది.

భారత్ వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసీ ప్రయాణం నేడు జరగనుంది. ఈ మేరకు నాసా అధికారికంగా ప్రకటించింది. యాక్సియం -4లో మొత్తం నలుగురు వ్యోమగాములు రోదసీ యాత్రకు బయలుదేరి వెళ్లనున్నారు. ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ సెంటర్ నుంచి ఈ రోజు మధ్యాహ్నం 12.01 గంటలకు ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగానికి సిద్ధమయింది.
పథ్నాలుగు రోజుల పాటు...
ఈ వ్యోమనాయకగురువారం సాయంత్రం 4.30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తో అనుసంధానమవుతుందని నాసా ప్రకటించింది. ఈ టీంకు మిషన్ పైలట్ గా శుభాంశు వ్యవహరిస్తారని కూడా చెప్పింది. కొన్ని కారణాల వల్ల వాయిదాలుపడుతూ వచ్చిన రోదసీ ప్రయాణం నేటికి ఖరారయింది. తొలుత మే 29న జరగాలి. అయితే నేటికి శుభాంశు శుక్లా రోదసీ ప్రయాణం ఖరారాయింది. ఈ టీం మొత్తం పథ్నాలుగు రోజుల పాటు రోదసీలో ఉండి పలు ప్రయోగాలను నిర్వహించనుంది.
Next Story