Thu Mar 19 2026 10:28:13 GMT+0530 (India Standard Time)
అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల మోత కలవరం రేపింది. దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు

అమెరికాలో మరోసారి కాల్పుల మోత కలవరం రేపింది. దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. అనంతరం ఒక పౌరుడు నిందితుడిని కాల్చి చంపారు. ఇండియానా మాల్ లోని ఫుడ్ కోర్టు లో ఈ కాల్పులు జరిగాయి. ఫుడ్ కోర్టులోకి ఒక్కసారిగా వచ్చిన ఆగంతకుడు కాల్పులు ప్రారంభించాడు. ఈ కాల్పుల్లో మాల్ లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించాడు. వెంటనే అప్రమత్తమైన ఒక పౌరుడు దుండగుడిపై కాల్పులు జరిపాడు.
నిందితుడు కూడా...
ఈ కాల్పుల్లో నిందితుడు కూడా మరణించాడు. దీంతో మొత్తం ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లయింది. కాల్పుల ఘటనలో మరికొందరికి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

