Sat Mar 21 2026 15:24:30 GMT+0530 (India Standard Time)
అమెరికాలో టోర్నడో బీభత్సం ... ఏడుగురి మృతి
అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. టోర్నడో దెబ్బకు ఏడుగురు మృతి చెందారు.

అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. టోర్నడో దెబ్బకు ఏడుగురు మృతి చెందారు. అమెరికాలోని అయోవా రాష్ట్రంలో టోర్నడోల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మృతి చెందిన ఏడుగురిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. టోర్నోడో దెబ్బకు అనేక భవనాలు దెబ్బతిన్నాయి. చెట్లు, విద్యుత్తు స్థంభాలు నేలకొరిగాయి. అనేక ప్రాంతాల్లో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు.
ఆస్తులు ధ్వంసం...
సెంట్రల్ అయోవాతో పాటు, డెస్ మోయిన్స్ వంటి ప్రాంతాల్లో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. ఉరములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు టోర్నడోలు ఏర్పడటంతో భవనాలతో పాటు అనేక ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి.
Next Story

