Sun Feb 01 2026 22:43:32 GMT+0000 (Coordinated Universal Time)
ఇమ్రాన్ కు పాక్ ఆర్మీ వార్నింగ్
ఇమ్రాన్ ఖాన్ కు పాక్ ఆర్మీ వార్నింగ్ ఇచ్చింది. 24 గంటల్లో ప్రధాని పదవికి రాజీనామా చేయాలని హెచ్చరించింది

ఇమ్రాన్ ఖాన్ కు పాక్ ఆర్మీ వార్నింగ్ ఇచ్చింది. 24 గంటల్లో ప్రధాని పదవికి రాజీనామా చేయాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదని హెచ్చరించింది. ఇమ్రాన్ ఖాన్ పై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం రేపు సభ ముందుకు రానుంది. పార్లమెంటులో చర్చ జరగనుంది. ఏప్రిల్ 4న అవిశ్వాసంపై ఓటింగ్ జరగనుంది. దీంతో ఇమ్రాన్ ఖాన్ ఆఖరి ప్రయత్నంగా తమ పార్టీ సభ్యులందరూ సమావేశాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఆర్మీ చీఫ్ తో....
ఈ నేపథ్యంలో ఆర్మీ ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. ఆర్మీ చీఫ్ తో పాటు ఐఎస్ఐ చీఫ్ ముఖ్యమైన అధికారులు ఇమ్రాన్ ఖాన్ తో సమావేశమై పరిస్థితిపై చర్చిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేసే అనివార్య పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. అవిశ్వాసానికి ముందే ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి దిగిపోతారన్న ప్రచారం జరుగుతుంది.
Next Story

