Fri Dec 05 2025 20:59:55 GMT+0000 (Coordinated Universal Time)
Operation Sindoor : భారత్ - పాక్ ఎవరి బలగం ఎంత? సోషల్ మీడియాలో సెర్చింగ్
ఆపరేషన్ సిందూరతో యుద్ధం అనివార్యమైతే భారత్ , పాకిస్తాన్ బలగాల సంగతేమిటన్న చర్చ జోరుగా సాగుతుంది

హహాల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన తర్వాత ఆపరేషన్ సిందూరతో యుద్ధం అనివార్యమైతే భారత్ , పాకిస్తాన్ బలగాల సంగతేమిటన్న చర్చ జోరుగా సాగుతుంది. పాకిస్థాన్ బలమెంత? భారత్ బలగం ఎంత? దాదాపు తొమ్మిది ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసిన భారత్ బలగాలు, పాకిస్థాన్ బలం సంగతిపైనే సోషల్ మీడియాలో కూడా ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. పాకిస్తాన్ సరిహద్దుల సమీపంలో ఎందుకు కాలుదువ్వుతుంది? దాని ధైర్యమేంటి? భారత్ తలచుకుంటే క్షణాల్లో మసైపోయే పాకిస్తాన్ లో ఇంతటి ధైర్యమెందుకు వచ్చిందన్నది కూడా చాలా మందికి అర్థం కాలేదు. అందుకే పాకిస్తాన్ బలం అనేది భారత్ తో పోల్చుకుంటే చాలా తక్కువని తెలిసినా వాటి వివరాల కోసం గూగుల్ లో వెతుకుతున్నారు.
నాలుగో స్థానంలో...
మిలటరీ ర్యాంకింగ్ లో భారత్ పాకిస్తాన్ కంటే ముందు వరసలో ఉంది. సైనిక శక్తికి సంబంధించి ప్రపంచంలోని 145 దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉంటే పాకిస్తాన్ పన్నెండో స్థానంలో ఉంది. భారత్ కు ఇరవై రెండు లక్షల మందికి పైగా సైనిక బలం ఉంది. దీంతో పాటు యుద్ధ ట్యాంకులు నాలుగువేలకు పైగానే ఉన్నాయి. లక్షన్నర ఆర్మర్డ్ వెహికల్స్ తో పాటు పవంద వరకూ సెల్ఫ్ ప్రొఫెల్డ్ అర్టిరీ, 3,975 వరకూ టోన్డ్ ఆర్టిలరీలు ఉన్నాయని తెలుస్తోంది. అదే సమయంలో మల్టీ బారెల్ రాకెట్ ఆర్టిలరీలు 264 వరకూ ఉన్నాయి.
పాక్ వద్ద మాత్రం...
కానీ పాకిస్తాన్ వద్ద మాత్రం పదమూడు లక్షల మంది సైనికులున్నారు. లక్షా ఇరవై నాలుగు వేల మంది నౌకాదళ సిబ్బంది, డెబ్బయి ఎనిమిది వేల మంది వైమానిక సిబ్బంది ున్నారు. పాక్ వద్ద 1,399 ఎయిర్ క్రాఫ్ట్ లుండగా,2,627 యుద్ధ ట్యాంకర్లున్నాయి. 662 సెల్ఫ్ ప్రొఫెల్లడ్ ఆర్టిలరీ, 2,629 టోడ్ ఆర్టిలరీ, ఆరువందల మల్టీ బ్యారెల్ ఆర్టిలరీలున్నాయి. పాక్ నౌకాదళం వద్ద 121యుద్ధనౌకులున్నాయి. అలాగే 116 ఎయిర్ పోర్టులు, అరవై మర్చంట్ మెరైన్ ఫ్లైట్లు ఉన్నాయని గ్లోబల్ పవర్ ఫైర్ వెబ్ సైట్ తెలిపింది.
భారత్ తో పోల్చుకుంటే...
భారత్ వాయుసేన వద్ద 3.10 లక్షల మంది సైనికులున్నారు. 2,229 విమానాలున్నాయి. వాటిలో యుద్ధ విమానాలు513 వరకూ ఉన్నాయి.ఆరు ట్యాంకర్ ఫ్లీట్ ఎయిర్ క్రాఫ్ట్ లు కలిగిన భారత్ వాయుసేనలో కూడా పాకిస్తాన్ కు మించి ఉంది. భారత్ త్రివిదళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వద్ద దాదాపు 899 హెలికాప్టర్లున్నాయి.వీటిలో దాదాపు ఎనభై అటాక్ హెలికాప్టర్లు. నౌకాదళం ప్రకారం చూసుకున్నా భారత్ బలం తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. పాకిస్తాన్ తో సరిపోల్చడానికి కూడా వీలులేదు. ఎందుకంటే భారత్ కు రెండు విమాన వాహన నౌకలతో పాటు మొత్తం 293 నౌకలున్నాయి. అర్జున్ ట్యాంక్ భారత్ కు ప్రత్యేకత. ఆధునిక ఫీల్డ్ గన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. డ్రోన్లు కూడా ఇరు దేశాలు దగ్గర పెట్టుకున్నా ఇందులో కూడా భారత్ దేపైచేయిగానే ఉంది. పాకిస్తాన్ కంటే భారత్ వద్ద మూడింతల బలం ఎక్కువగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. భారత్ బలగంతో పోల్చుకుంటే పాక్ త్రివిధ దళాల బలం తీసికట్టుగానే చెప్పొచ్చు
Next Story

