Fri Jan 09 2026 03:07:23 GMT+0000 (Coordinated Universal Time)
America : అమెరికాలో ఐసీఈ కాల్పులు.. డ్రైవర్ మృతి
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వ తాజా వలసదారుల కట్టుదిట్టమైన చర్యల మధ్య మినియాపోలిస్‌లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి

అమెరికాలో ట్రంప్ ప్రభుత్వ తాజా వలసదారుల కట్టుదిట్టమైన చర్యల మధ్య మినియాపోలిస్‌లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ) అధికారుల కాల్పుల్లో ఓ కారు డ్రైవర్ మృతి చెందాడు. ఇది ఆత్మరక్షణలో జరిగిన కాల్పులని ఫెడరల్ అధికారులు చెబుతుండగా, నగర మేయర్ మాత్రం ఇది నిర్లక్ష్యంగా, అవసరం లేని చర్యగా వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల ప్రకారం.. రోడ్డుమధ్య ఆగిన ఎస్యూవీ వద్దకు ఓ ఐసీఈ అధికారి వెళ్లి తలుపు తీయాలని డిమాండ్ చేశాడు.
సమీపం నుంచి కాల్చి...
తలుపు హ్యాండిల్ పట్టుకున్న సమయంలో వాహనం ముందుకు కదలింది. ఆ సమయంలో వాహనం ముందు నిల్చున్న మరో ఐసీఈ అధికారి తుపాకీ తీసి సమీపం నుంచి కనీసం రెండు రౌండ్లు కాల్చాడు. వాహనం అతని వైపు కదలడంతో అతడు వెనక్కి దూకినట్టు వీడియోల్లో కనిపిస్తోంది. వాహనం నిజంగా అధికారిని ఢీకొట్టిందా లేదా అన్నది స్పష్టంగా తేలలేదు. కాల్పుల అనంతరం ఎస్యూవీ అదుపు తప్పి రోడ్డుపక్కన నిలిపి ఉంచిన రెండు కార్లను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనతో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
వలసదారులపై చర్యలు...
ట్రంప్ ప్రభుత్వ పాలనలో ప్రధాన అమెరికా నగరాల్లో కొనసాగుతున్న వలసదారుల అమలు చర్యల్లో ఇది తీవ్రత పెరిగిన ఉదంతంగా అధికారులు చెబుతున్నారు. 2024 నుంచి ఇప్పటివరకు పలు రాష్ట్రాల్లో జరిగిన వలసదారులపై చర్యలకు సంబంధించి కనీసం ఐదో మరణ ఘటనగా ఇది నమోదైంది. దీనిపై ఆందోళన వ్యక్తమవుతుంది. నిరసనకారులు ఆందళనకు దిగారు. వారిని అదుపు చేసేందుకు భద్రతాదళాలు రంగంలోకి దిగాయి. మొత్తం మీద వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం చర్యలను నిరసిస్తూ ఇటీవల అమెరికాలో ఆందోళనలు ఉధృతమయ్యాయి.
Next Story

