Fri Dec 05 2025 08:03:09 GMT+0000 (Coordinated Universal Time)
Hurricane : క్యూబాలో తుపాను ఎఫెక్ట్.... 40 మంది మృతి
క్యూబాలో హరికేన్ బీభత్సం సృష్టించింది. సుమారు నలభై మంది మరణించారు.

క్యూబాలో హరికేన్ బీభత్సం సృష్టించింది. సుమారు నలభై మంది మరణించారు. అట్లాంటిక్ మహాసముద్రంలో అత్యంత తీవ్రంగా నమోదైన తుపాన్లలో ఒకటైన హరికేన్ మెలిస్సా క్యూబా, హైతీ, జమైకాలను ధ్వంసం చేసింది. కనీసం నలభై మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రులయ్యారు. గంటకు 185 మైళ్ల వేగంతో వీచిన గాలులు, వరదలతో మూడు దేశాలు స్తంభించిపోయాయి. జమైకాలోని సెయింట్ ఎలిజబెత్ జిల్లాలో కొండచరియలు జారిపడి రహదారులు మూసుకుపోయాయి. సాంటా క్రూజ్‌లో మట్టి కుప్పల మధ్య ప్రజలు ఇళ్లలోని వస్తువులు రక్షించుకునే ప్రయత్నం చేశారు.
నిరాశ్రయులుగా మారి...
ఒక పాఠశాలపైకప్పు ఎగిరిపోయింది. ఆ భవనం ప్రభుత్వ ఆశ్రయంగా గుర్తించారు. ఇంత పెద్ద తుపాను నేను ఎప్పుడూ చూడలేదని అక్కడి స్థానికులు చెబుతున్నారు. మంగళవారం జమైకాను తాకిన ఈ తుపాను తర్వాత క్యూబాకు దూసుకెళ్లి ఆ తరువాత కాస్త బలహీనపడింది. అయినా దాని ప్రభావం పరిసర దేశాలకూ విస్తరించింది. హైతీలో 40 మంది మరణించారని సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అధికారి స్టీవెన్ అరిస్టిల్ తెలిపారు. వారిలో 20 మంది పిటిటిగోవ్ పట్టణంలో మృతి చెందగా, మరో 10 మంది గల్లంతయ్యారు.
లక్షలాది మంది పునరావాస కేంద్రాల్లో...
క్యూబాలో అనేక ఇళ్లు కూలిపోయాయి. రహదారులు తెగిపోయాయి. సుమారు 7.35 లక్షల మంది పునరావాస శిబిరాల్లో ఉన్నారని అధికారులు తెలిపారు. జమైకాలో 25 వేల మంది ఆశ్రయాల్లో తలదాచుకున్నారు. దీవి మొత్తం 77 శాతం ప్రాంతంలో విద్యుత్ నిలిచిపోయింది. కమ్యూనికేషన్ అంతరాయం వల్ల నష్టాన్ని అంచనా వేయడం కష్టమైందని విపత్తు నిర్వహణ అధికారులంటున్నారు. ప్రధానమంత్రి ఆండ్రూ హోల్నెస్ మాత్రం ప్రభుత్వం పూర్తిగా సహాయక చర్యలపై దృష్టి పెట్టిందని, రక్షణ చర్యలు, సహాయక పంపిణీ జరుగుతున్నాయని పేర్కొన్నారు. బ్లాక్ రివర్ పట్టణ మేయర్ రిచర్డ్ సోలమన్
సహాయక చర్యలను...
తుపాన్ ప్రభావంతో ఆ ప్రాంతంలోని ఆసుపత్రి, పోలీసు, అత్యవసర సేవలన్నీ దెబ్బతిన్నాయి. సాయం కేంద్రం కూడా ధ్వంసమైంది. అమెరికా సహాయక బృందాలను పంపుతుందని విదేశాంగ మంత్రి మార్కో రుబియో ప్రకటించారు. క్యూబాలోని సాంటియాగో డి క్యూబా, గ్రాన్మా ప్రాంతాల్లో 15 అంగుళాల వర్షపాతం నమోదైంది. అనేక గ్రామాలు నీటమునిగాయి. అసలే ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న క్యూబాకు ఇది మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టనుంది. మియామీ నేషనల్ హరికేన్ సెంటర్ ప్రకారం, బుధవారం మధ్యాహ్నం వరకు మెలిస్సా వేగం గంటకు 100 మైళ్లకు తగ్గింది. అయితే తుపాను విస్తృతి పెరిగి, దాని ప్రభావం బహామాస్ దీవుల మీద కొనసాగుతుందని చెప్పింది.
Next Story

