Sun Mar 15 2026 22:06:39 GMT+0530 (India Standard Time)
Earth Quake : చైనాను వణికించిన భూకంపం
చైనాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.2 తీవ్రతగా నమోదయింది.

చైనాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.2 తీవ్రతగా నమోదయింది. ఈ భూకంప తీవ్రతతో నిద్రలో ఉన్న జనం భయంతో బయటకు పరుగులు తీశారు. భారీ భూకంపం కావడంతో నష్టం తీవ్రత కూడా ఎక్కువగానే ఉండే అవకాశముందని తెలిసింది. కొన్ని భవనాలు నేలమట్టమయినట్లు వార్తలు అందుతున్నాయి.
ఆస్తినష్టం....
అయితే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎంత మేరకు జరిగిందన్నది చైనా అధికారికంగా ప్రకటించలేదు. కానీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో నష్టం కూడా అంతే స్థాయిలో ఉంటుందన్న అంచనాలు వినపడుతున్నాయి. సహాయక చర్యలను ప్రారంభించారని తెలిసింది. పూర్తి వివరాలను చైనా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Next Story

