Fri Dec 05 2025 12:02:33 GMT+0000 (Coordinated Universal Time)
ప్రకృతి విలయం.. భారీ హిమపాతానికి 42 మంది మృతి
కల్లోల భరిత ఆప్ఘాన్ లో ప్రకృతి విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భారీ హిమపాతం ధాటికి 42 మంది

కల్లోల భరిత ఆప్ఘాన్ లో ప్రకృతి విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భారీ హిమపాతం ధాటికి 42 మంది మృతి చెందారు. కొద్దిరోజులుగా అక్కడ విపరీతంగా మంచు కురుస్తుండగా.. ఇప్పటివరకూ 42 మంది మృత్యువాత పడగా.. 76 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మూడు వారాలుగా ఆప్ఘాన్ లోని 15 ప్రావిన్సులలో మంచు బీభత్సం సృష్టిస్తోంది.
Also Read : శరద్ పవార్ కు కరోనా పాజిటివ్
అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో.. రహదారులు మూసుకుపోయాయి. ప్రజలు కూడా ఇళ్లలోంచి బయటికి వచ్చే మార్గం లేదు. మంచు వర్షానికి 20 రోజుల్లో 2 వేలకు పైగా ఇళ్లు ధ్వంసం అయినట్లు అధికారులు చెప్తున్నారు. సహాయక చర్యలకూ హిమపాతం వల్ల అంతరాయం ఏర్పడింది. ఇటీవలే అక్కడ భూకంపాల ధాటికి ప్రాణ నష్టం జరగ్గా.. ఇప్పుడు హిమపాతం ఆప్ఘాన్ల పాలిట మృత్యువుగా మారింది.
Next Story

