Sun Feb 01 2026 07:33:25 GMT+0000 (Coordinated Universal Time)
ఆస్ట్రేలియాలో భారీ వరదలు
ఆస్ట్రేలియాలో భారీ వర్షం కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలు సంభవించాయని స్థానికులు చెబుతున్నారు

ఆస్ట్రేలియాలో రికార్డు స్థాయి వరదలు సంభవిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో భారీ వర్షం కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలు సంభవించాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో క్వీన్స్‌ల్యాండ్‌లో ఎమర్జన్సీ ప్రకటించి అక్కడి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు సహాయక బృందాలు తరలిస్తున్నాయి.
రెండు రోజులుగా...
గత రెండు రోజుల్లో రికార్డ్ స్థాయిలో 293 మీల్లీమీటర్ల వర్షం కురిసిందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో వర్షాల వల్ల నది మట్టాలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సహాయక బృందాలు మాత్రం నిరంతరం పహారా కాస్తున్నాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
Next Story

