Sun Feb 01 2026 10:51:23 GMT+0000 (Coordinated Universal Time)
విషాదం.. హ్యారీపోటర్ నటుడు కన్నుమూత
హ్యారీపోటర్, స్టార్ వార్స్ వంటి సినిమాల్లో నటించి మెప్పించిన నటుడు పాల్ గ్రాంట్ (56) లండన్ లోని యాస్టర్ రోడ్ సెయింట్..

ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల తెలుగు, తమిళ, కన్నడ, బాలీవుడ్ పరిశ్రమల్లో ప్రముఖ నటుల మరణాలు తీవ్రవిషాదాలను మిగిల్చాయి. తాజాగా హాలీవుడ్ లో మరో నటుడు కన్నుమూశాడు. హ్యారీపోటర్, స్టార్ వార్స్ వంటి సినిమాల్లో నటించి మెప్పించిన నటుడు పాల్ గ్రాంట్ (56) లండన్ లోని యాస్టర్ రోడ్ సెయింట్ పాంక్రస్ స్టేషన్ లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మరణించాడని వైద్యులు తెలిపారు.
పాల్ గ్రాంట్ అనేక బ్రిటీష్, హాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించాడు. అతనికి స్పాండిలోపిఫిసిల్ డైస్పాల్షియా కాంజెనిటల్ అనే అరుదైన జెనిటిక్ డిజార్డర్ ఉండటంతో ఎత్తు పెరగలేదు. సినిమాల పరంగా అదే అతనికి కలిసొచ్చింది. పాల్ గ్రాంట్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పాల్ గ్రాంట్.. మద్యానికీ, మత్తుపదార్థాలకు బానిసయ్యాడు. పాల్ గ్రాంట్ ఆకస్మిక మరణంపై హాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Next Story

