Thu Sep 12 2024 12:41:23 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ బై 2021.. కోటిఆశలతో 2022కి స్వాగతం పలికిన మొదటి దేశం !
ఇండియాలో న్యూ ఇయర్ ప్రారంభమయ్యేందుకు మరికొద్దిగంటల సమయం మాత్రమే ఉంది. ప్రపంచంలో అందరికన్నా ముందే
న్యూ ఇయర్ కు గ్రాండ్ గా స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధమైంది. దేశంలోని ప్రధాన నగరాల్లోని పబ్ లు, క్లబ్ లు కోవిడ్ నియమ నిబంధనలను పాటిస్తూ.. ఈవెంట్లకు ముస్తాబయ్యాయి. కోవిడ్, ఒమిక్రాన్ ల వ్యాప్తి నేపథ్యంలో ఎన్నో ఆంక్షలు, నియమ నిబంధనల నడుమ ఈవెంట్లు జరగనున్నాయి. తాగి వాహనం నడిపేవారికి మాత్రం.. జరిమానాల మోత మోగనుంది. ఇండియాలో న్యూ ఇయర్ ప్రారంభమయ్యేందుకు మరికొద్దిగంటల సమయం మాత్రమే ఉంది.
ప్రపంచంలో అందరికన్నా ముందే పసిఫిక్ మహాసముద్రంలోని సమోవా, టోంటా, కిరిబాటి దీవుల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. అక్కడ న్యూ ఇయర్ వచ్చిన గంట తర్వాత న్యూజిలాండ్ ప్రజలు నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ఎన్నో మధుర జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటూ.. 2021కి గుడ్ బై చెప్పి..కోటి ఆశలతో 2022కి స్వాగతం పలికారు ఆక్లాండ్ వాసులు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు న్యూజిలాండ్ కొత్త ఏడాదిలో అడుగుపెట్టింది. ఇక్కడి ఛాధమ్ దీవులు, రాజధాని అక్లాండ్లో అర్థరాత్రి 12 గంటలు కావడంతో అక్కడి ప్రజలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. పెద్ద సంఖ్యలో క్రాకర్స్ కాల్చి సందడి చేస్తున్నారు. పరస్పరం ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
ఇక భారత్ కన్నా ఐదున్నర గంటల ముందే ఆస్ట్రేలియా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా సిడ్నీ హార్బర్ బ్రిడ్జి వద్దకు లక్షలాది మంది చేరుకుని న్యూఇయర్ వేడుకలను అంబరాన్నంటేలా జరుపుకున్నారు. జపాన్ కూడా మనకంటే మూడు గంటలు ముందే 2022లోకి అడుగుపెడుతోంది. ఆ తర్వాత ఇండియా న్యూ ఇయర్ కు స్వాగతం పలుకుతుంది. భారత్ కన్నా నాలుగున్నర గంటలు ఆలస్యంగా 43 దేశాలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకనున్నాయి. ఇలా వరుసగా ప్రపంచంలోనే తొలుత అక్లాండ్లో కొత్త ఏడాది 2022 వచ్చింది. ఆ తర్వాత వరుసగా సిడ్నీ, టోక్యో, బీజింగ్-హాంగ్కాంగ్, దుబాయి, ప్యారిస్ – రోమ్-బ్రసెల్స్, లండన్, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్లలో కొత్త ఏడాది ప్రారంభం అవుతుంది.
Next Story