Sun May 19 2024 02:26:04 GMT+0000 (Coordinated Universal Time)
ఏషియన్ గేమ్స్ నిరవధిక వాయిదా.. కారణమిదే !
చైనాలో కరోనా పరిస్థితులు ఇప్పట్లో నియంత్రణలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో.. 19వ ఏషియన్ గేమ్స్ ను వాయిదా వేస్తున్నట్టు
చైనా : 2022 ఏషియన్ గేమ్స్ నిరవధికంగా వాయిదా పడ్డాయి. అందుకు కారణం కరోనానే. ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి 25 వరకూ జరగాల్సిన ఏషియన్ గేమ్స్ కరోనా కారణంగా ఆగిపోయాయి. చైనాలో కరోనా విజృంభణే ఇందుకు ప్రధాన కారణం. చైనాలోని హాంగ్ఝూలో నిర్వహించాల్సి ఉండగా.. ప్రస్తుతం అక్కడ కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. తీవ్రమైన లాక్ డౌన్ ఆంక్షలతో అక్కడ కోట్లాదిమంది ప్రజలు.. ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తుండటమే కాక.. మానసిక సమస్యలకు గురవుతున్నారు.
చైనాలో కరోనా పరిస్థితులు ఇప్పట్లో నియంత్రణలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో.. 19వ ఏషియన్ గేమ్స్ ను వాయిదా వేస్తున్నట్టు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా ప్రకటించింది. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని చెప్పింది. గత నెలలోనే అన్ని ఈవెంట్లకు సంబంధించి హాంగ్ఝూలో 56 పోటీ వేదికలను నిర్మించామని ఏషియన్ గేమ్స్ నిర్వాహకులు చెప్పారు. అప్పటికే అక్కడ కరోనా ఉండగా.. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ గేమ్స్ నిర్వహిస్తామని చెప్పారు కానీ.. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అక్కడ గేమ్స్ కండక్ట్ చేయలేమంటూ నిరవధిక వాయిదా వేశారు.
Next Story