Mon Apr 13 2026 09:08:58 GMT+0530 (India Standard Time)
Haiti stampede : తొక్కిసలాట...25 మంది మృతి... వందలాది మందికి గాయాలు
హైతీలోని మిలోట్లో తొక్కిసలాట జరిగింది

హైతీలోని మిలోట్లో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఇరవై ఐదు మంది మరణించారు. సిటాడెల్ లాఫెరియర్ వద్ద జరిగిన తొక్కిసలాటలోఅనేక మంది గాయపడ్డారు. పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన కొండపై కోట వద్ద శనివారం జరిగిన తొక్కిసలాటలో కనీసం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. ముందుగా ప్రకటించిన మరణాల సంఖ్యను అధికారులు సవరించారు.మిలోట్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో పలువురు ఊపిరాడక మూర్చపోయారని, మరికొందరు తొక్కిసలాటలో పడిపోయారని కాప్-హైటియన్ మున్సిపల్ అధికారులు వెల్లడించారు. చారిత్రక స్థలంలో సంప్రదాయ వేడుకలకు హాజరైన వారిలో చాలామందిని ఆసుపత్రులకు తరలించారని, ఇంకా కొందరు కనిపించడంలేదని తెలిపారు.
రద్దీ కారణంగానే...
“ప్రాథమిక సమాచారం ప్రకారం… తీవ్ర రద్దీ పరిస్థితి, జన సమూహాన్ని నియంత్రించడంలో లోపాల వల్ల ఈ తొక్కిసలాటు జరిగింది” అని స్థానిక అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.హైతీ జాతీయ పోలీసులు కూడా వేరే ప్రకటన విడుదల చేసింది. ఘటనకు ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామని తెలిపింది. దర్యాప్తు తర్వాతే మృతుల సంఖ్యను 25గా నిర్ధారించినట్లు పేర్కొంది. ఆదివారం మృతదేహాలకు శవపరీక్షలు కొనసాగించామని వెల్లడించింది.
30మందికి ఆసుపత్రుల్లో ...
ఇంకా 30 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. వదంతులు వ్యాప్తి చేయకుండా అధికారులకు సహకరించాలని ప్రజలను కోరారు. హైతీ ప్రభుత్వం ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. ఆదివారం కూడా కొందరి మృతదేహాలు ఘటనాస్థలంలోనే ఉండిపోయాయి. డొనాల్డ్సన్ జీన్ తన సోదరి మృతదేహాన్ని తెల్లటి కవరుతో మోసుకెళ్తూ కన్నీరుమున్నీరయ్యాడు. ప్రతిభావంతుల కోసం నిర్వహించిన పాఠశాల విద్యార్థుల పర్యటనలో పాల్గొనే అర్హత సాధించేందుకు ఆమె తీవ్రంగా చదువుకుందని తెలిపారు.“ఉదయం, రాత్రి… ఆమె చదువుతూనే ఉండేది. భోజనం ముందు హోంవర్క్‌లో సహాయం చేయమని నన్ను అడిగేది. ఇలా ఆమెను కోల్పోయాను” అని ఆయన వేదన వ్యక్తం చేశారు.
Next Story

