Fri Dec 05 2025 13:47:05 GMT+0000 (Coordinated Universal Time)
NISAR : నైసార్ ప్రయోగం కౌంట్ డౌన్ నేటి నుంచి... ఎనెన్ని ప్రయోజనాలో?
నేటి నుంచి జీఎస్ఎల్వీ కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. 11,200 కోట్లతో నాసా, ఇస్రో నైసార్ ఉపగ్రహాన్ని ఉమ్మడి ప్రయోగం చేయనుంది

ఈరోజు నుంచి జీఎస్ఎల్వీ కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. 11,200 కోట్లతో నాసా, ఇస్రో నైసార్ ఉపగ్రహాన్ని ఉమ్మడి ప్రయోగం చేయనుంది. రేపు నింగిలోకి నైసార్ ఉపగ్రహం దూసుకెళ్లనుంది. రేపు సాయంత్రం 5.40 గంటలకు GSLV-F16 రాకెట్ ద్వారా నింగిలోకి నైసార్ ఉపగ్రహం దూసుకెళ్లనుంది. భూమి అణువణువును 12 రోజులకోసారి నిసార్ స్కాన్ చేసేస్తుంది. అడవులు, మైదాన ప్రాంతాలు, కొండలు, పర్వతాలు, పంటలు, జల వన రులు, మంచు ప్రాంతాలు.. ఇలా అన్నింటినీ జల్లెడ పడుతుంది. భూమి పొరల్లో ఒక్క అంగుళం మార్పు వచ్చినా గుర్తించేస్తుంది. కొండచరియలు విరిగిపడటాన్ని, భూకంపాలను, అగ్నిపర్వతాలు బద్దలవ డాన్ని ముందే గుర్తించేందుకు వీలుంటుంది. ఇది అమెరికా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థలు నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టిన ప్రయోగం కావడం విశేషం.
ప్రపంచంలోనే తొలిసారి...
నైసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్. ఒక ట్రక్కు పరిమాణంలో, 2,393 కిలోల బరువున్న నిసార్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్16 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ ఉపగ్రహం భూమికి 743 కిలోమీటర్ల ఎత్తున సూర్యానువర్తన కక్ష్యలో పరిభ్రమిస్తూ పరిశీలిస్తుంది. దీనిలో నాసాకు చెందిన ఎల్-బ్యాండ్, ఇస్రోకు చెందిన ఎస్-బ్యాండ్ రాడార్లు, రెండింటి డేటాను సమ్మిళితం చేసే డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపా ర్చర్ రాడార్, 12 మీటర్ల వ్యాసం ఉండే జల్లెడ వంటి ప్రత్యేక రాడార్ యాంటెన్నాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి ఉపగ్రహం ప్రపంచంలో ఇదే మొదటిది అని కూడా అంటున్నారు.
భారత్ ఖర్చు ఎంతంటే?
నిసార్ ప్రాజెక్టు ఖర్చును నాసా, ఇస్రోలకు చెరి సగం భరించనున్నాయి.. ఇందుకు అనుగుణంగా శాటిలైట్ డిజైన్, తయారీ, పరికరాలు, గ్రౌండ్ స్టేషన్లు, రాకెట్, ప్రయోగం బాధ్యతలను ఇరు దేశాలు విభజించుకున్నాయి. ప్రాజెక్టుకు మొత్తం రూ.11,200 కోట్ల వ్యయం అవుతుండగా.. అందులో ఇస్రోకు అవుతున్నది సుమారు పన్నెండు వందల కోట్ల రూపాయలేనని ఈ అంచనా. ఇస్రో రాకెట్ ప్రయోగాలు, నిర్వహణ ఖర్చులు చాలా తక్కువ కావడంతో మన దేశం భరించాల్సిన వ్యయం స్వల్పంగా ఉందని.. ప్రాజె క్టులో వాటా మాత్రం సగం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భూమిపై అడవులు, పంటల విస్తీర్ణం, అభి వృద్ధి, పచ్చదనంలో తేడాలను.. నేల తేమను, నీటి వనరులను గుర్తిస్తుంది. వాటిలో ఎప్పటికప్పుడు వచ్చే తేడాలను గమనిస్తుంది. తగిన చర్యలు తీసు కునేందుకు వీలు కల్పించేలా ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. తుపానులు, వరదలు, సునామీలు, కార్చి చ్చులు వంటివాటి రియల్ టైమ్ డేటా ను అందించి.. సహాయక చర్యలు వెంటనే చేపట్టడానికి తోడ్పడుతుంది.
Next Story

