Tue Jul 08 2025 17:51:06 GMT+0000 (Coordinated Universal Time)
Miss World : నేడు ప్రపంచ సుందరి పోటీలు...ఎవరికి దక్కేనో కిరీటం
హైదరాబాద్ లో నేడు మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్ ఫినాలే జరగనుంది. ప్రపంచ సుందరి ఎవరన్నది నేడు తేలిపోనుంది.

హైదరాబాద్ లో నేడు మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్ ఫినాలే జరగనుంది. ప్రపంచ సుందరి ఎవరన్నది నేడు తేలిపోనుంది. హైదరాబాద్ లోని హైటెక్స్ లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. విజేతకు 8.5 కోట్ల రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నారు. దీంతో పటు 1,770 వజ్రాలతో కూడిన బంగారు కిరీటాన్ని కూడా సొంతం చేసుకోనున్నారు. దీంతో పాటు మిస్ వరల్డ్ బ్రాండ్ అంబాసిడర్ హోదాలో ఏడాది పాటు ప్రపంచమంతా ఉచితంగా పర్యటించే వెసులుబాటు ఉంది. ఇక ప్రకటనలు, సినిమా అవకాశాలు కూడా లభించనున్నాయి. మిస్ వరల్డ్ పోటీలు గత కొద్ది రోజులుగా తెలంగాణలో జరుగుతున్నాయి. ప్రపంచ సుందరీమణుల రాకతో తెలంగాణలో కొత్త కళ వచ్చినట్లయింది.
మే పదిన ప్రారంభమై...
ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్ లోని గచ్చి బౌలి స్టేడియంలో మే 10వ తేదీన ప్రారంభమయ్యాయి. మే 31వ తేదీతో ముగియనున్నాయి. మొత్తం 108 దేశాలకు చెందిన సుందరీమణులు రాగా, పోటీలు నిర్వహించి క్వార్టర్ ఫైనల్స్ నలభై మందిని ఎంపిక చేశారు. అందులో పదహారు మందిని తిరిగి ఎంపిక చేశారు. తుదిపోటీల్లో నలభై మందిలో పోటీలకు ముందు ఇరవై నాలుగు మందిని ప్రకటిస్తారు. అనంతరం ఒక్కొక్క విభాగం నుంచి ఇద్దరు చొప్పున ఎనిమిది మందిని ఎంపిక చేసి చివరకు ఒకరిని ఎంపిక చేస్తారు. హైటెక్స్ లో భారీ బందోబస్తు మధ్య ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. పాస్ ఉన్నవారినే అనుమతిస్తారు.
పోటీలు ఇలా...
నేడు జరగనున్న మిస్ వరల్డ్ పోటీలలో అమెరికా కరేయబియన్ విభాగం నుంచి ట్రినిడాడ్ - బొబాగో, మార్టినిక్, ప్యూర్టోనికో, యూరప్ నుంచి ఎస్తోనియా, వేల్స్, భారత్ నుంచి నందినీ గుప్తాతో పాటు టర్కీ, థాయలంాండ్, ఇండినేసియాకు చెందని ప్రపంచ సుందరీమణులున్నారు. తుది పోటీల్లో ఒక్కొక్క విభాగం నుంచి పది మందిని ఎంపిక చేసి తర్వాత పోటీలకు ముందు ఇరవై మందిని ఎంపిక చేస్తారు. తర్వాత నాలుగు విభాగాల నుంచి ఇద్దరేసి చొప్పున ఎంపిక చేస్తారు. చివరకు ఎనిమిది మంది మిగులతారు. అందులో ముగ్గురిని మిస్ వరల్డ్ విజేతులగా ఎంపిక చేస్తారు. ఒకరు మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకంటే, మిగిలిన ముగ్గురు రన్నరప్ లుగా నిలుస్తారు. భారత్ నుంచి నందిని గుప్తా ఉండటంతో ఈసారి మిస్ వరల్డ్ పోటీలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఈ పోటీలను 150 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయనున్నారు.
Next Story