Wed Mar 04 2026 11:31:57 GMT+0530 (India Standard Time)
వార్ ముదురుతున్న వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ కీలక ప్రకటన
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ కీలక ప్రకటన చేశారు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ కీలక ప్రకటన చేశారు. ఖతార్, కువైట్, యూఏఈలతో ఫ్రాన్స్‌కు రక్షణ ఒప్పందాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఆస్తుల రక్షణకు ‘చార్లెస్ డి గల్లె’ విమాన నౌకను పంపిస్తున్నామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ చెప్పారు. ఇరాన్ -ఇజ్రాయిల్ మధ్య యుద్ధం గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకోవడంతో ఫ్రాన్స్ ఈ నిర్ణయం తీసుకుంది.
రక్షణ ఒప్పందాల మేరకు...
తమకు ఉన్న రక్షణ ఒప్పందాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ చెప్పారు. పశ్చిమాసియాకు ఎయిర్ వింగ్, రక్షణ ఫ్రిగేట్లు పంపుతున్నామని కూడా తెలిపారు. యుద్ధం విస్తరిస్తున్న సమయంలో తమ అవసరం ఆ దేశాలకు ఎంతో ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ అభిప్రాయపడ్డారు.
Next Story

