Mon Dec 15 2025 08:55:48 GMT+0000 (Coordinated Universal Time)
జిమ్మీ కార్టర్ కు నూరేళ్లు నిండాయ్
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మరణించారు.ఆయన వయసు వంద సంవత్సరాలు

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మరణించారు.ఆయన వయసు వంద సంవత్సరాలు. వృద్ధాప్యంలో వచ్చిన సహజమైన అనారోగ్యంతో జార్జియాలోని ప్లెయిన్స్ లో ఆయన కన్నుమూశారు. జిమ్మీ కార్టర్ మృతికి ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది దేశాధినేతలు సంతాపాన్ని ప్రకటించారు. 1977 లో అమెరికా అధ్యక్షుడయిన జిమ్మీ కార్టర్ 1981 వరకూ పనిచేశారు. ఆయన అనేక రకాలుగా అమెరికాను అగ్రరాజ్యంగా అభివృద్ధి చేయడానికి తన వంతు ప్రయత్నం చేశారు.

నోబెల్ శాంతి బహుమతి...
వ్యాధుల నిర్మూలన, శాంతి స్థాపన, మానవ హక్కుల అభివృద్ధి వంటి అంశాల విషయంలో ఆయన కు మంచి పేరుంది. జిమ్మీ కార్టర్ అంత్యక్రియలను అధికారక లాంఛనాలతో నిర్వహిస్తారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. 1924 అక్టోబరు 1వ తేదీన జిమ్మీకార్టర్ జన్మించారు. రెండు నెలల క్రితం తన వందో పుట్టిన రోజు వేడడుకలను జరుపుకున్నారు. 2002లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.
Next Story

