Wed Mar 18 2026 22:49:27 GMT+0530 (India Standard Time)
టెక్సాస్ లో వరదలు...104 మంది మృతి
అమెరికా టెక్సాస్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 104కు చేరింది.

అమెరికా టెక్సాస్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 104కు చేరింది. వరదలు తీవ్రంగా సంభవించిన కేర్ కౌంటీ ప్రాంతంలోనే 84 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి భారీవర్షాలతో పాటు వరదలు కూడా ముంచెత్తడంతో అనేక మంది నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు.
32 మంది ఆచూకీ...
దాదాపు వందకు మందికి పైగా మరణించగా టెక్సాస్ లో గల్లంతయిన వారిలో మరో 32 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. వరదల ధాటికి పదుల సంఖ్యలో కార్లు కొట్టుకువస్తున్నాయి. అయితే టెక్సాస్ లో వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు పాకిస్థాన్ లో జూన్ 26 నుంచి వరదలు సంభవించి 72 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
Next Story

