Tue Jul 15 2025 16:35:12 GMT+0000 (Coordinated Universal Time)
చైనా నూతన సంవత్సర వేడుకల్లో కాల్పులు.. 10 మంది మృతి
కాల్పులకు పాల్పడిన వ్యక్తి పరారవ్వగా.. అతనికోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా.. మాంటెరీ పార్క్..

చైనీయులు జరుపుకునే లూనార్ వేడుకల్లో అలజడి రేగింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న చైనా కొత్త సంవత్సరాది వేడుకల్లో కాల్పులు జరిగాయి. కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్ నగరంలో చైనీయులు నూతన సంవత్సరం సందర్భంగా.. లూనార్ ఫెస్టివల్ ను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా.. ఓ దుండగుడు తుపాకీతో లోపలికి ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో సుమారు 10 మంది మరణించగా.. 9 మంది గాయపడినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాల్పులకు పాల్పడిన వ్యక్తి పరారవ్వగా.. అతనికోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా.. మాంటెరీ పార్క్ నగరంలో ఆసియా సంతతి వారు అధికంగా ఉంటారు. మాంటెరీ పార్క్ నగరం లాస్ ఏంజెల్స్ డౌన్ టౌన్ కు 16 కిమీ దూరంలో ఉంటుంది. చైనా నూతన సంవత్సర వేడుకల్లో రేగిన ఈ అలజడితో కాలిఫోర్నియా ఉలిక్కిపడింది.
Next Story