Fri Sep 29 2023 14:47:33 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర అగ్నిప్రమాదం.. మంటలు చెలరేగి 13మంది సజీవదహనం
అమెరికాలోని ఫిలడెల్పియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో

అమెరికాలోని ఫిలడెల్పియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో 13 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫెయిర్ మౌంట్ ప్రాంతంలోని ఓ భవనంలో రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. రెండవ అంతస్తుకు చేరుకునేందుకు భారీ నిచ్చెనలను ఉపయోగించారు.
Also Read : హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ స్వాధీనం
గోడలకు భారీ రంధ్రాలు చేసి.. ఒక చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. సుమారు గంటసేపు శ్రమించి మంటలను ఆర్పివేశారు. కానీ.. ప్రాణాపాయం నుంచి ఎవరినీ కాపాడలేకపోయారు. 13 మంది సజీవదహనమవ్వగా.. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. భవనంలో నాలుగు స్మోక్ డిటెక్టర్లు ఉన్నప్పటికీ.. సమయానికి అవి పనిచేయకపోవడంతో ఈ ఘోరె జరిగినట్లు తెలుస్తోంది.
Also Read : ఐదు రోజులు కాదు... 14 రోజుల క్వారంటైన్ బెటర్
Next Story