Fri Feb 14 2025 18:07:39 GMT+0000 (Coordinated Universal Time)
విషాదం...టర్కీలో ఘోర అగ్ని ప్రమాదం.. 66 మంది మృతి
టర్కీలోని రెండు అంతస్తుల హోటల్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 66 మంది ప్రాణాలు కోల్పోయారు

టర్కీలోని రెండు అంతస్తుల హోటల్ భవనంలో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 66 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మరో 51 మందికి గాయాలైనట్లు మంత్రి అలీ తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో 234 మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అతిధులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టర్కీకి వెళ్లిన వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మంటలు ఒక్కసారిగా...
టర్కీలోని స్కీయింగ్ రిసార్టు హోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అరవై ఆరు మంది మంది సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది. అయితే సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేశాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మంటల్లో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
నాలుగో అంతస్తులో...
పన్నెండు అంతస్తుల హోటల్లోని నాల్గవ అంతస్తులో మంటలు చెలరేగాయని గవర్నర్ అబ్దుల్ అజీజ్ ఐడిన్ తెలిపారు. తెల్లవారుజామున 3:30 గంటలకు మంటలు చెలరేగాయని, ఈ ఘటనలో 66 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 51 మందికి గాయాలైనట్లు మంత్రి అలీ వెల్లడించారు. అయితే వీరిలోనూ అనేక మంది మృత్యువుతో పోరాడుతున్నారని తెలిపారు. దీంతో టర్కీలో విషాదం నెలకొంది. అంతర్జాతీయంగా ఈ వార్త వైరల్ కావడంతో తమ కుటుంబ సభ్యుల కోసం అనేక మంది ఆరా తీస్తున్నారు. టర్కీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇందుకోసం కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
Next Story