Fri Dec 12 2025 13:45:03 GMT+0000 (Coordinated Universal Time)
ఎఫ్ఐఏ అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి.. తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం
శ్రీకాంత్ అక్కపల్లిని ఎఫ్ఐఏ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

అమెరికాలోని ఇండియన్ కమ్యూనిటీలను ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ యూఎస్ఏ -2026 కార్యవర్గాన్ని ప్రకటించింది. అక్కపల్లి శ్రీకాంత్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సంస్థను 1970లో స్థాపించారు. ఈస్ట్ కోస్ట్‌లోని ఎనిమిది రాష్ట్రాల్లో భారతీయుల తరఫున సేవలందిస్తున్న అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఇది గుర్తింపు పొందింది. అమెరికాలో ఉన్న భారతీయుల కోసం పనిచేసే అతిపెద్ద సంస్థలలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఒకటి. న్యూయర్క్ నగరంలో ఇండియా పరేడ్ వంటి అతి పెద్ద కార్యక్రమాలను ఎఫ్ఐఏ నిర్వహిస్తుంది.
వచ్చే ఏడాది జనవరి 1నుంచి...
2026 సంవత్సరానికి సంబంధించి అంతర్గత సమీక్ష, ఎంపిక ప్రక్రియను సంస్థ నియమించిన స్వతంత్ర ఎన్నికల కమిషన్ నిర్వహించింది. ఆ కమిషన్‌లో అలోక్ కుమార్, జయేష్ పటేల్, కెన్నీ దేశాయ్ ఉన్నారు. కమిషన్ చేసిన సిఫార్సులను బోర్డు ఆమోదించింది. కొత్త కార్యవర్గం వచ్చే ఏడాది జనవరి 1వ తదీ నుంచి బాధ్యతలు చేపడుతుంది. ఈ పదవిని చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి శ్రీకాంత్ అక్కపల్లి. ఇటువంటి సంస్థకు తెలుగు వ్యక్తి నాయకత్వం వహించడం అనేది తెలుగుప్రజలకు దక్కిన అరుదైన గౌరవం. ఈ సంస్థకు శ్రీకాంత్ అక్కపల్లిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
వ్యాపారవేత్తగా ఎదిగి...
కొత్త సంవత్సరానికి శ్రీకాంత్ అక్కపల్లిని ఎఫ్ఐఏ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యవర్గానికి నాయకుడిగా వైదొలుగుతున్న అధ్యక్షుడు సౌరిన్ పరిక్ బాధ్యతలను శ్రీకాంత్ అక్కపల్లికి అప్పగించనున్నారు. గత బృందం నుంచి వైస్ ప్రెసిడెంట్ ప్రీతి రె పటేల్, జనరల్ సెక్రటరీ శ్రిష్టి కౌల్ నరూలా తమ స్థానాల్లోనే కొనసాగుతారని తెలిపింది. శ్రీకాంత్ అక్కపల్లి వృత్తిరీత్యా వ్యాపారవేత్త. అలాగే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్, టెక్నాలజీ, మీడియా రంగాలలో ఆయనకు చాలా అనుభవం ఉంది. ముఖ్యంగా అమెరికాలో తెలుగు మీడియా రంగంలో ప్రముఖంగా పనిచేస్తున్నారు. ఎఫ్ఐలోకి లోకి రాకముందు కూడా ఆయన అనేక కమ్యూనిటీ సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు
Next Story

