Sun Jul 20 2025 06:19:49 GMT+0000 (Coordinated Universal Time)
పాక్ లో బతకడమూ కష్టమేనా? ద్రవ్యోల్బణం దెబ్బకు భారీగా పెరిగిన ధరలు
పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ ముదిరిపోతుంది. దాయాది దేశంలో బతకడమూ కష్టంగానే మారింది.

పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ ముదిరిపోతుంది. దాయాది దేశంలో బతకడమూ కష్టంగానే మారింది. సాధారణ ప్రజల జీవన పరిస్థతిులు దినదిన గండంగా మారాయి. కరోనా తర్వాత అనేక దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. అందులో పాక్ ఒకటి. శ్రీలంకలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కూడా మనకు తెలుసు. ఇప్పుడిప్పుడే శ్రీలంక తేరుకుంటుంది. కానీ పాక్ మాత్రం తేరుకునే పరిస్థితుల్లో లేదు. పాక్ లో పెట్రోలు, డీజిల్ ధరలు చూస్తేనే భయమేస్తుంది. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడంతో ఆ ప్రభావం నిత్యావసరాలపై పడింది. దీంతో సాధారణ, మధ్యతరగతి ప్రజలు బతకలేక అవస్థలు పడుతున్నారు. గత కన్ని రోజుల నుంచి పాక్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.
ఆర్థిక కష్టాల నుంచి...
ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు పాక్ ప్రభుత్వం చేస్తున్నా అందులో నుంచి బయపడేందుకు మాత్రం సాధ్యం కావడం లేదు. లీటరు పెట్రోలు ధర పాక్ లో రెండు వందల రూపాయలకు పైచిలుకు ఉండటంతో వ్యక్తిగత వాహనాలను పక్కన పెట్టేసే పరిస్థితి నెలకొంది. ప్రజా రవాణా వ్యవస్థనే ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. ప్రజా రవాణాకు ఉపయోగించే వాహనాల ఛార్జీలు కూడా విపరీతంగా పెరగడంతో పాక్ ప్రజల జీవితం దుర్భరంగా మారింది. గోధుమ పిండి దగ్గర నుంచి కొత్తిమీర కట్ట వరకూ ధరలు చుక్కలు చూపుతున్నాయి. ఇదంతా పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడమే కారణమని అక్కడ పౌరులు గగ్గోలు పెడుతున్నారు.
లీటర్ పెట్రోల్ ధర ఎంతంటే?
పాకిస్తాన్ లో ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర 233 రూపాయలకు చేరుకుంది. ఒక్కసారిగా ధరలు పెరగడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగని ప్రజలను సైన్యం అణిచివేస్తుందే తప్ప ధరలను తగ్గించడం లేదు. పెట్రో ఉత్పత్తులపై రాయితీలను కూడా భరించలేని పరిస్థితుల్లో పాక్ ప్రభుత్వం ఉండటంతో ధరలు అనివార్యంగా పెరుగుతన్నాయి. ఇకలీటర్ డీజిల్ ధర 211 రూపాయలకు చేరుకుంది. ప్రభుత్వం ిప్పటికే పెట్రోలు రాయితీలపై 120 బిలియన్లు వెచ్చిస్తుందని, ద్రవ్యోల్బణం స్థాయికి పెరగడంతో ఇక పెట్రోలు, ధరలు పెంచక తప్పడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద పాకిస్తాన్ లో మాంద్యం దెబ్బకు ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితులు ఎంతో దూరంలో లేవని అంతర్జాతీయ విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు.
Next Story