Mon Feb 02 2026 14:46:14 GMT+0000 (Coordinated Universal Time)
టర్కీలో భూకంపం.. తీవ్రత ఎంతంటే?
టర్కీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ భూకంప తీవ్రత 7.8 గా నమోదయినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వీస్ తెలిపింది.

టర్కీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ భూకంప తీవ్రత 7.8 గా నమోదయినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వీస్ తెలిపింది. ఈరోజు తెల్లవారు జామున 4.17 గంటలకు ఈ భూకంపం సంభవించింది. 17.9 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు పేర్కొంది. ఆగ్నేయ టర్కీలో ఈ భూకంపం సంభవించింది.
భవనాలు ధ్వంసం...
తొలుత పదిహేను నిమిషాల తర్వాత 6.7 తీవ్రతగా భూకంపం సంభవించినట్లు పేర్కొంది. సిరియా, సైప్రస్ లలో కూడా ప్రకంపనలు సంభవించాయని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి ప్రాణ నష్టంపై వివరాలు తెలియరాలేదు. ఆస్థి నష్టం వివరాలు మాత్రం తెలిశాయి. కొన్ని నగరాల్లో భవనాలు ధ్వంసమయినట్లు తెలిసింది.
- Tags
- earthquake
- turkey
Next Story

