Sun Mar 15 2026 22:08:26 GMT+0530 (India Standard Time)
Earth Quake : పాక్ లో భూకంపం... శనివారం మాత్రమే
పాకిస్థాన్ లో భూకంపం సంభవించింది. పాకిస్థాన్ లోని ఇస్తామాబాద్ లో సంభవించిన ఈ భూకపంతో ప్రజలు వణికిపోయారు

పాకిస్థాన్ లో భూకంపం సంభవించింది. పాకిస్థాన్ లోని ఇస్తామాబాద్ లో సంభవించిన ఈ భూకపంతో ప్రజలు వణికిపోయారు. భూకపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.7గా నమోదయింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం భూకంపం 190 కిలోమీటర్ల లోతులో సంభవించింది. అయితే ఈ భూకంపం సంభవించడంతో ప్రజలు భయకంపితులై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
గత శనివారం కూడా...
ఈరోజు ఉదయం ఈ భూకంపం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ప్రాణ, ఆస్తి నష్టంపై ఎలాంటి వివరాలు అందలేదు. గత శనివారం కూడా భూకంపం సంభవించింది. గత శనివారం లాహోర్, పెషావర్, ఇస్లామాబాద్ లో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేట్ 4.9 గా నమోదయింది. అందుకే పాకిస్థాన్ ప్రజలు శనివారం అంటేనే భయపడిపోతున్నారు.
Next Story

