Sat Mar 21 2026 19:58:26 GMT+0530 (India Standard Time)
ఆప్ఘన్, పాక్లో భూకంపం.. 11 మంది మృతి
ఆప్ఘనిస్తాన్, పాకిస్థాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.6 తీవ్రతతో నమోదయింది. 11 మంది మృతి చెందారు.

ఆప్ఘనిస్తాన్, పాకిస్థాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.6 తీవ్రతతో నమోదయింది. 11 మంది మృతి చెందారు. హిందుకుష్ పర్వత ప్రాంతంలోని 180 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. భూకంప ప్రకపంనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
ప్రజలు....
పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్, పెషావర్, లాహోర్, రావల్పిండి ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ 11 మంది చనిపోయినట్లు తెలిపారు. 120 మందికి పైగా గాయాలపాలయినట్లు చెబుతున్నారు. ఆస్తి నష్టం కూడా జరిగిందని చెబుతున్నారు. సహాయ చర్యలను బృందాలు ప్రారంభించాయి.
Next Story

