Thu Dec 18 2025 13:48:21 GMT+0000 (Coordinated Universal Time)
ఇండోనేషియోలో భారీ భూకంపం
ఇండోనేషియోలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రతతో నమోదయిందని ఇండోనేషియా జియో ఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది.

ఇండోనేషియోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రతతో నమోదయిందని ఇండోనేషియా జియో ఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. భూకంప తీవ్రతతో ప్రజలు భయంతో కంపించిపోయారు. భూకంపం తీవ్రతతో సుమత్రా దీవుల్లో సంభవించడంతో అధికారులు తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత ఉపసంహరించుకున్నారు.
రిక్టర్ స్కేల్‌పై...
ప్రజలు భూకంప తీవ్రతకు భయంతో వణికిపోయారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. తెల్లవారుజామున మూడు గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిబెరుట్ దీవిని ప్రజలు ఇప్పటికే ఖాళీ చేశారు.
Next Story

