Sat Dec 06 2025 08:51:13 GMT+0000 (Coordinated Universal Time)
చైనాలో లాక్డౌన్.. తిరగబడుతున్న జనం
చైనాలో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో అనేక పట్టణాల్లో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఆంక్షలను అమలు చేస్తుంది.

చైనాలో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో అనేక పట్టణాల్లో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఆంక్షలను అమలు చేస్తుంది. దీంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆంక్షలు తొలగించాలంటూ ప్రజలు నిరసనలు తెలియజేస్తున్నారు. ఉరుంకి నగరంలో కరోనా ఆంక్షల వల్లనే అగ్నిప్రమాదంలో చిక్కుకుని పది మంది చనిపోయారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆంక్షలను వ్యతిరేకిస్తూ ఉద్యమానికి దిగారు.
ఆంక్షలు ఎత్తివేయాలంటూ...
చైనాలో రోజుకు ముప్ఫయివేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం ముందుగానే అనేక నగరాల్లో ఆంక్షలు విధించింది. లాక్ డౌన్ ను అమలు చేస్తుంది. నిర్దేశించిన సమయాల్లోనూ ప్రజలు బయటకు వచ్చి తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయాలని చెప్పింది. అయితే ప్రజలు మాత్రం ఆంక్షల పట్ల పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
Next Story

