Fri Feb 14 2025 18:15:08 GMT+0000 (Coordinated Universal Time)
Donald Trump : ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే ఏం నిర్ణయాలు తీసుకున్నారంటే?
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.

నాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొన్నింటిని రద్దు చేశారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కొన్నింటిని వెంటనే అమలులోకి తెస్తూ సంతకాలు చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు అమెరికా గడ్డపైన పుట్టిన పిల్లలకు పౌరసత్వం అందించే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. అమెరికా గడ్డ మీద పిల్లలు పుడితే ఎవరైనా వారికి పుట్టుకతోనే పౌరసత్వం లభిస్తుంది. కానీ ఇప్పుడు తాజాగా ట్రంప్ తీసుకన్న నిర్ణయంతో అలాంటి పౌరసత్వ హక్కు లభించదు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం ఉన్న పిల్లలకు ఈ హక్కు సంక్రమించాల్సి ఉన్నా దానిని ట్రంప్ రద్దు చేశారు.
వరస సంతకాలతో...
దీనివల్ల వలసలు తగ్గడమే కాకుండా అమెరికా పౌరులకు సరైన అవకాశాలు లభించనున్నాయి. మొత్తం 78 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్ సంతకాలు చేశారు. ఫెరల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని రద్దు చేశారు. 24 గంటలు ఫెడరల్ ఉద్యోగులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గత అమెరికా అధ్యక్షుడు బైడన్ తీసుకున్న నిర్ణయాలను రద్దు చేశారు. దక్షిణ అమెరికా భాగంలో అక్రమ వలసను నిరోధిసంచడానికి పారిస్ ఒప్పందం నుంచి బయటకు వస్తున్నట్లు సంతకం పెట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటకు వస్తున్నట్లు సంతకం పెట్టారరు. కేపిటల్ హిల్స్ పై దాడి చేసిన పదిహేను వందల మందికి క్షమాబిక్షను పెడుతూ సంతకం చేశారు.
టిక్ టాక్ విభాగాన్ని...
కెనాడా, మెక్సికోలపై ఇరవై ఐదు శాతం అదనపు సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తన కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితుల జోలికి పోకుండా తగిన రక్షణ చర్యలు కల్పిస్తూ ట్రంప్ తీసుకున్నారు. చైనాకు చెందిన టిక్ టాక్ విభాగాన్ని విక్రయించేందుకు 75 రోజులు అవకాశమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే 2030 నుంచి కొనుగోలు చేసే వాహనాల్లో కనీసం యాభై శాతం విద్యుత్తు వాహనాలు ఉండాలని గత అధ్యక్షుడు బైడన్ జారీ చేసిన ఉత్తర్వులను కూడా ట్రంప్ రద్దు చేశారు. తొలిరోజు ఇలాంటి అసాధరణమైన నిర్ణయాలను తీసుకుని ట్రంప్ సంచలనం సృష్టించారు. ప్రధానంగా అమెరికా పౌరులకు లబ్ది చేకూర్చేలా ఈ నిర్ణయాలు ఉన్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.
Next Story